Coronavirus in India: భారత్‌ లో థర్డ్‌ వేవ్‌ లోనే అత్యధిక మరణాలు నమోదు, నిన్నటితో పోలిస్తే తగ్గిన కరోనా కేసులు, దేశంలో 93.31 శాతానికి చేరిన రికవరీ రేటు

నిన్నటితో పోలిస్తే ఇవాళ కరోనా కేసులు(Corona cases) తక్కువగానే వచ్చినప్పటికీ...డైలీ కేసులు(Daily cases) మూడు లక్షలు దాటాయి. గడిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3.37 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు (Positive cases) న‌మోదు అయ్యాయి.

Coronavirus Outbreak in India (Photo Credits: IANS)

New Delhi January 22: భారత్‌(India)లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కరోనా కేసులు(Corona cases) తక్కువగానే వచ్చినప్పటికీ...డైలీ కేసులు(Daily cases) మూడు లక్షలు దాటాయి. గడిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3.37 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు (Positive cases) న‌మోదు అయ్యాయి. నిన్న‌టితో పోల్చితే 9వేల 550 కేసులు త‌క్కువ‌గా న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అయితే మరణాల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 488 మరణాలు (Covid Deaths) నమోదయ్యాయి. ఈ వేవ్‌లో ఇవే అత్యధికం. ఇక గడిచిన 24 గంటల్లో 2,42,676 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3.88 కోట్ల‌కు చేరింది. యూఎస్ త‌ర్వాత కొవిడ్‌కు అత్యంత ప్ర‌భావితమైన దేశం ఇండియానే.

ప్ర‌స్తుతం దేశంలో రిక‌వ‌రీ రేటు 93.31 శాతం (Recovery rate)గా ఉంది. డైలీ పాజిటివిటీ (Daily positivity) రేటు 17.22 శాతంగా న‌మోదైంది. వీక్లి పాజిటివిటీ రేటు 16.65 శాతంగా న‌మోదైంది. ఇక దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron cases) పాజిటివ్ కేసుల సంఖ్య 10,050కి చేరింది. కొవిడ్ వ్యాక్సిన్ (Vaccination) పంపిణీ 161 కోట్ల మార్క్‌కు చేరింది. 94 శాతం మంది యువ‌త ఫ‌స్ట్ డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.