Coronavirus in India: దేశంలో 140 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు, కొత్తగా 38,353 మందికి కరోనా పాజిటివ్‌, 497 మంది మృతి, ఇప్పటి వరకు మొత్తం 51.90 కోట్ల డోసులు పంపిణీ

దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య (Coronavirus in India) ఎక్కువగానే ఉంటుండడం కాస్త ఊరటనిస్తోంది.గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 17,77,962 మందికి పరీక్షలు నిర్వహించగా.. 38,353 మందికి (India reports 38,353 new cases) పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Coronavirus-in-India ( photo-PTI)

New Delhi, August 11: దేశవ్యాప్తంగా కేసులు మళ్లీ 40వేలకు చేరువకాగా.. దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య (Coronavirus in India) ఎక్కువగానే ఉంటుండడం కాస్త ఊరటనిస్తోంది.గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 17,77,962 మందికి పరీక్షలు నిర్వహించగా.. 38,353 మందికి (India reports 38,353 new cases) పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

క్రితం రోజు కేసుల(28,204)తో పోలిస్తే ఇది 36శాతం ఎక్కువ. అయితే కొత్త కేసుల్లో సగానికి పైగా(55శాతం) ఒక్క కేరళలోనే నమోదవడం గమనార్హం. నిన్న ఆ రాష్ట్రంలో 21,119 కొత్త కేసులు బయటపడగా.. 152 మంది మృతిచెందారు. అటు మరణాల్లోనూ పెరుగుదల కన్పించింది. నిన్న మరో 497 మంది వైరస్‌తో మరణించారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,29,179 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.20కోట్ల మార్క్‌ను దాటింది. తాజాగా 40,013 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 3,12,20,981 మంది డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 97.45శాతానికి చేరుకుందని పేర్కొంది.

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త, మరో కోటి గ్యాస్‌ కనెక్షన్ల కోసం ఉజ్వల 2.0 స్కీమ్ ప్రారంభించిన ప్రధాని మోదీ, ఎల్‌పీజీ కనెక్షన్లు పొందలేక పోయిన పేద కుటుంబాలకు కొత్త గ్యాస్ కనెక్షన్లు

ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,86,351గా ( Active caseload currently 3,86,351) ఉన్నాయని, 140 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 51.90 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.34శాతానికి, రోజువారీ 2.16శాతానికి చేరుకుతుందని తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 48.50కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.