Covid in India: హైట్ తక్కువ వాళ్లకి కరోనాతో చాలా డేంజరట.., దేశంలో 24 గంటల్లో 45,903 మందికి కరోనా, 490 మంది మృతితో 1,26,611కు చేరుకున్న కోవిడ్ కేసుల సంఖ్య
పొడుగువాళ్లతో పోలిస్తే పొట్టివాళ్లే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
New Delhi, November 9: దేశంలో గడచిన 24 గంటలలో 45,903 కోవిడ్ పాజిటివ్ కేసులు (Covid in India) నమోదవగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 85,53,657కి చేరుకుంది. ఇక గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా వల్ల మొత్తం 490 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,26,611కు (Covid Deaths) చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 48,405 ఉండగా.. ఇప్పటి వరకు కోవిడ్‌కి చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 79,17,373గా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 5,09,673 ఉన్నాయి. ఇక దేశంలో కరోనా (Coronavirus Outbreak in India) రోగుల రికవరీ రేటు 92.56 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 5.96 శాతంగా ఉండగా..మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.48 శాతానికి తగ్గింది.
ఇదిలా ఉంటే సింగపూర్ పరిశోధకులు ఓ సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. వారి కనుగొన్న వివరాల ప్రకారం పొడుగువాళ్లతో పోలిస్తే పొట్టివాళ్లే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రెండు మీటర్ల దూరంలో ఉన్న కరోనా రోగి తుమ్మినా, తగ్గినా వెలువడే తుంపర్లలో చిన్నవి తొందరగా నేలకు చేరుకుంటుండగా.., పెద్దగా ఉన్న తుంపర్లు మెల్లగా రెండు మీటర్ల దూరం వరకు ప్రయాణించి నేలకు చేరతాయి. ఈ క్రమంలో ఐదు మీటర్ల ఐదు అంగుళాల ఎత్తున ప్రయాణిస్తున్న ఈ తుంపర్లు.. రెండు మీటర్ల దూరంలో ఐదున్నర అడుగుల ఎత్తున్న మనుషులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ముఖంపై ఈ తుంపర్లు పడే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు.
బ్రిటీష్ మహిళల సరాసరి ఎత్తు 5 అడుగుల మూడు అంగుళాలు కనుక వారి సమీపంలో కరోనా రోగి దగ్గినా, తుమ్మినా వారికి వైరస్ వ్యాపించే అవకాశం పూర్తిగా ఉందని ఈ అధ్యయనం ద్వారా సింగపూర్ పరిశోధకులు తేల్చారు. ఇక బ్రిటన్‌లో మగవారి సగటు ఎత్తు ఐదు అడుగుల తొమ్మిది అంగుళాలు కనుక వారికి అలా వైరస్ సోకే ప్రమాదం లేదని తెలిపారు. ఒక్క బ్రిటన్‌లోనే కాకుండా రెండు మీటర్ల భౌతిక దూరాన్ని పాటిస్తున్న అన్ని దేశాల్లో కరోనా రోగి ఐదున్నర అడుగుల పొడవుండి తుమ్మినా, దగ్గినా అంతకన్న తక్కువుండే వారికి సోకే అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
ఇక మన దేశానికి వస్తే.. సగటు మహిళల ఎత్తు ఐదు అడుగులే కనుక భారత్‌లో కూడా ఇలా వైరస్ సోకే ప్రమాదం ఉందన్న మాటజ ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో పాటు నేడు చాలా దేశాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా రెండు మీటర్ల భౌతిక దూరాన్ని అందరు పాటించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.