Coronavirus in India: పండగ వేళ కరోనా పరేషాన్, జాగ్రత్తలు తీసుకోకుంటే కేసులు విపరీతంగా పెరుగుతాయని తెలిపిన కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు కమిటీ, తాజాగా 55,722 మందికి కరోనా
వైరస్ బాధితుల్లో తాజాగా 579 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,14,610 కు (Coronavirus Deaths) చేరింది. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 66,399 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 66,63,608గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 7,72,055. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
New Delhi, October 19: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 55,722 పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 75 లక్షల మార్కుని (COVID-19 Tally Goes Past 75 Lakh) దాటింది. వైరస్ బాధితుల్లో తాజాగా 579 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,14,610 కు (Coronavirus Deaths) చేరింది. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 66,399 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 66,63,608గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 7,72,055. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 88.26 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 10.23 శాతం యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించికంది. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని తెలిపింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,59,876 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. మొత్తం పరీక్షల సంఖ్య 9,50,83,976 కు చేరిందని పేర్కొంది. ఇక 83,87,799 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 75,50,273 కేసులతో భారత్ రెండో స్థానంలో, 52, 35,344 కేసులతో బ్రెజిల్ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో అత్యధికంగా 2,24,730 మంది కోవిడ్ బారినపడి మరణించారు.
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆదివారమే హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. పండుగ సీజన్ వేళ ఒకవేళ సరైన నిబంధనలు పాటించకుంటే ఒక నెలలోనే.. 26 లక్షల కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ నేతృత్వంలోని కమిటీ హెచ్చరించింది. పది సభ్యులు ఉన్న కమిటీ.. శీతాకాలంలో రెండవ దఫా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. శీతల వాతావరణంలో శ్వాసకోస వ్యాధులు విజృంభిస్తాయని ఆ కమిటీ పేర్కొన్నది.