Coronavirus in India: భారత్‌లో కొనసాగుతున్న కరోనా తీవ్రత, గడిచిన 24 గంటల్లో 6,650 కొత్త కేసులు నమోదు, దేశవ్యాప్తంగా 358కి చేరిన ఒమిక్రాన్ కేసులు
గడిచిన 24 గంటల్లో 6,650 మందికి కరోనా నిర్ధారణ(Covid-19) అయింది. 374 మంది మరణించారు. అయితే కరోనా కొత్త కేసుల కంటే రికవరీలు(Recoveries) ఎక్కువగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 7,051 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 77,516 యాక్టీవ్ కేసులు(Corona Active cases)న్నాయి.
New Delhi December 24: భారత్‌లో కరోనా(Corona) తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 6,650 మందికి కరోనా నిర్ధారణ(Covid-19) అయింది. 374 మంది మరణించారు. అయితే కరోనా కొత్త కేసుల కంటే రికవరీలు(Recoveries) ఎక్కువగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 7,051 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 77,516 యాక్టీవ్ కేసులు(Corona Active cases)న్నాయి.
అటు పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్(Omicron variant) వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న పలు రాష్ట్రాల్లో భారీగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 358కి చేరాయి. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా వేగంగా కొనసాగుతోంది. దేశంలో 140 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.