Corona Cases in India: భారత్‌లో కొత్తగా 7,992 కరోనా కేసులు నమోదు, 559 రోజుల కనిష్టానికి యాక్టీవ్ కేసులు, జోరుగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ
దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,82,736కు చేరింది. ఇందులో 3,41,14,331 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,75,128 మంది మృతి(Covid-19 Deaths)చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 93,277 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
New Delhi December 11: భారత్‌లో కరోనా(Corona virus) తీవ్రత క్రమంగా తగ్గుతోంది. యాక్టీవ్ కేసుల (Active cases) సంఖ్య గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health and Family Welfare) తెలిపింది. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 559 రోజుల కనిష్టానికి చేరాయి.
ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,992 కరోనా కేసులు (Corona cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,82,736కు చేరింది. ఇందులో 3,41,14,331 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,75,128 మంది మృతి(Covid Deaths)చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 93,277 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
శుక్రవారం కరోనా వల్ల 398 మంది బాధితులు మరణించగా, 9265 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 131.99 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 32 ఒమిక్రాన్(Omicron) కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో 17, రాజస్థాన్ 9, గుజరాత్ 3, కర్ణాటక 2, ఢిల్లీలో ఒకటి చొప్పున ఉన్నాయి.