Corona Cases in India: భారత్‌లో తగ్గిన కరోనా తీవ్రత, ఊరట కలిగిస్తున్న రికవరీల సంఖ్య, వ్యాక్సినేషన్లో కొనసాగుతున్న జోష్
గడిచిన 24 గంటల్లో 8వేల 318 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 465 మంది కరోనా భారిన పడి మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,67,933 కు చేరింది. నిన్న ఒక్కరోజే 10వేల 967 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,39,88,797కు చేరింది.
New Delhi November 27: భారత్ (India) లో కరోనా తీవ్ర కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 8వేల 318 కొత్త కరోనా కేసులు(Corona Cases) నమోదయ్యాయి. 465 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,67,933 కు చేరింది. నిన్న ఒక్కరోజే 10వేల 967 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,39,88,797కు చేరింది.
అయితే యాక్టీవ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. దేశంలో ప్రస్తుతం లక్షా 7వేల 19 యాక్టీవ్ కేసులున్నాయి. కేరళ(Kerala) లో కరోనా తీవ్రత ఇంకా అలాగే ఉంది. అక్కడ శుక్రవారం కూడా 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 121.06 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు (Vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
మరోవైపు ప్రపంచచవ్యాప్తంగా ఒమిక్రాన్(Omicron) వేరియంట్ పట్ల పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి పలు దేశాలకు ఈ వేరియంట్ విస్తరించడంతో భారత్‌లో కూడా టెన్షన్ మొదలైంది.