COVID19 in India: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,771 పాజిటివ్ కేసులు నమోదు, భారత్‌లో 6,48,315కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 18,655కు పెరిగిన కరోనా మరణాలు
2,793,022 కేసులతో యూనైటైడ్ స్టేట్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత రష్యా, బ్రెజిల్ దేశాలు ఉండంగా ప్రస్తుతం ఇండియా ...
New Delhi, July 4: భారతదేశంలో మరోసారి రికార్డ్ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 22,771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 6,48,315 కు చేరింది. నిన్న ఒక్కరోజే 442 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 18,655 కు పెరిగింది.
అయితే గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,334 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,94,226 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 235,433 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
COVID19 India Update:
ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు శుక్రవారం నాటికి 11 మిలియన్ల మైలురాయిని దాటినట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలుస్తుంది. 2,793,022 కేసులతో యూనైటైడ్ స్టేట్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత రష్యా, బ్రెజిల్ దేశాలు ఉండంగా ప్రస్తుతం ఇండియా నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఆసియా నుంచి భారత్ కరోనావైరస్ కు కొత్త హాట్ స్పాట్ గా మారినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.