M M Navarane: పార్లమెంట్ ఓకే అంటే పీఓకే మనదే, ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే కీలక వ్యాఖ్యలు, చొరబాట్లను అడ్డుకోవడమే భారత సైనికుల ముందున్న తక్షణ కర్తవ్యమన్న ఆర్మీ చీఫ్
పీఓకె భారత్‌కే చెందాలని పార్లమెంట్ భావిస్తే.. దానికి అనుగుణంగా ఆర్మీ యాక్షన్ ఉంటుందని వ్యాఖ్యానించారు. పైనుంచి ఆదేశాలు వస్తే చర్యలు తీసుకోవడానికి సిద్దమని తెలిపారు.
New Delhi, January 11: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై (Pakistan Occupied Kashmir (PoK))నూతన ఆర్మీ జనరల్ ఎమ్ ఎమ్ నరవణే (Indian Army Chief Manoj Mukund Naravane)కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకె భారత్‌కే చెందాలని పార్లమెంట్ భావిస్తే.. దానికి అనుగుణంగా ఆర్మీ యాక్షన్ ఉంటుందని వ్యాఖ్యానించారు. పైనుంచి ఆదేశాలు వస్తే చర్యలు తీసుకోవడానికి సిద్దమని తెలిపారు.
పార్లమెంట్ ఒకే అంటే పీఓకే మనదే అని అన్నారు. జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)భారత అంతర్భాగమని పార్లమెంట్ తీర్మానం చేసిందని.. ఒకవేళ పీఓకె కూడా మనకే చెందాలని భారత్ (India)భావిస్తే.. దానిపై పార్లమెంట్‌లో తీర్మానం చేయాల్సి ఉంటుందని చెప్పారు.
ఆ తీర్మానంపై తమకు ఆదేశాలు అందితే పీఓకెపై చర్యలకు సిద్దమవుతామని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370(Article 370) రద్దు తర్వాత పీఓకెను కూడా స్వాధీనం చేసుకోవాలని పలువురు కేంద్రమంత్రులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.
Here's ANI Tweet
కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ పీఓకె భారత అంతర్భాగమని గతేడాది సెప్టెంబర్‌లో వ్యాఖ్యానించారు. అంతేకాదు,ఏదో ఒకరోజు దానిపై భౌతిక చర్యకు దిగుతామని చెప్పారు.
ఎవరీ నూతన సైన్యాధిపతి మనోజ్ ముకుంద్?
రాజ్యాంగాన్ని అనుసరించి సాయుధ దళాలు సేవలందిస్తాయని అన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి అంశాలకు సాయుధ దళాలు ప్రాధాన్యతనిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో యుద్ధాలను ఎదుర్కొనేందుకు పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తున్నామని పేర్కొన్నారు. యుద్ధాలను ఎదుర్కొనేందుకు సైన్యానికి కఠినమైన, నాణ్యతతో కూడిన శిక్షణను అందిస్తున్నామని నరవణే అన్నారు.
Here's ANI Tweet
దేశానికి సేవ చేయడమనే సైనికుల లక్ష్యమని, వారి ఆశలను నెరవేర్చే బాధ్యత తమపై ఉందని తెలిపారు. మూడు దళాలను పటిష్టపరిచే నూతన డిఫెన్స్ చీఫ్ పదవిని సృష్టించడం పెద్ద సవాలుతో కూడుకున్నదని, కేంద్ర ప్రభుత్వం దానిని సమర్థవంతంగా నిర్వర్తించిందని అభిప్రాయపడ్డారు. దేశ సమైక్యతను కాపాడే బాధ్యత కేవలం సాయుధ దళాలకే కాకుండా ప్రజలందరికీ ఉందని అభిప్రాయపడ్డారు.
అమ్మాయిలతో రాసలీలలు సాగించేలా భారత గూఢాచారులు ఉండరు
జమ్మూకశ్మీర్ గురించి ప్రస్తావిస్తూ.. ప్రతీరోజూ ఇంటలిజెన్స్ రిపోర్టులు అందుతున్నాయని.. ఆ మేరకు ఎల్‌ఓసీ వద్ద అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నామని చెప్పారు. చొరబాట్లను అడ్డుకోవడం భారత సైన్యం ముందున్న తక్షణ,తాత్కాలిక ప్రాధాన్యత అని.. సాంప్రదాయ యుద్దం అనేది దీర్ఘకాలిక ప్రాధాన్యత అని చెప్పారు.ఇక త్వరలోనే డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్‌కు, చైనా వెస్ట్రన్ కమాండ్‌కు మధ్య హాట్‌లైన్ ఏర్పాటు జరుగుతుందన్నారు.