Stock Markets: ప్రారంభంలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు, జీవితకాల గరిష్టానికి చేరిన సూచీలు, ఐటీ కంపెనీల షేర్లకు భారీ లాభాలు

నిఫ్టీ (Nifty) 73 పాయింట్లు లాభపడి 20,143 దగ్గర కొనసాగుతోంది. రెండు ప్రధాన సూచీలు ట్రేడింగ్‌ ఆరంభంలోనే జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్‌ 67,706.18 దగ్గర, నిఫ్టీ 20,153.60 వద్ద రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి

Stock Market (Photo Credits: Twitter)

Mumbai, SEP 14: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు సానుకూలంగానే ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ రికార్డు గరిష్ఠాల దగ్గర ట్రేడింగ్‌ను ప్రారంభించడం విశేషం. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 234 పాయింట్ల లాభంతో 67,701 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 73 పాయింట్లు లాభపడి 20,143 దగ్గర కొనసాగుతోంది. రెండు ప్రధాన సూచీలు ట్రేడింగ్‌ ఆరంభంలోనే జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్‌ 67,706.18 దగ్గర, నిఫ్టీ 20,153.60 వద్ద రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.98 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, విప్రో, ఎంఅండ్‌ఎం, టైటన్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.

 

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ప్రస్తుతం అక్కడి స్టాక్‌ ఫ్యూచర్స్‌ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఐరోపా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆసియా పసిఫిక్‌ సూచీల్లో చైనా, హాంకాంగ్‌ మినహా మిగిలిన మార్కెట్లలన్నీ పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) నిన్న రూ.1,631 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DII) రూ.849.86 కోట్లు విలువ చేసే షేర్లను కొనగోలు చేశారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ ప్రస్తుత వాటాదార్ల నుంచి 1.5 బి.డాలర్లను (సుమారు రూ.12,300 కోట్లు) సమీకరించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న బయోఫార్మా సంస్థ సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌లో రూ.9,589 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)కి ప్రభుత్వం అనుమతినిచ్చింది. సైప్రస్‌ కేంద్రంగా ఉన్న బెర్‌హైందా లిమిటెడ్‌ ఈ పెట్టుబడిని అందిస్తోంది. అంబుజా సిమెంట్స్‌ కొనుగోలు కోసం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు అదానీ గ్రూప్‌ పలు అంతర్జాతీయ బ్యాంకులతో తుది దశ చర్చలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల స్టాక్స్‌పై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.



సంబంధిత వార్తలు