India Deploys Warships in Arabian Sea: అరేబియా సముద్రంలో 10 యుద్ధనౌకలను మోహరించిన భారత్, శత్రువుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు
పైరసీ, డ్రోన్ దాడులను అరికట్టేందుకు భారత నావికాదళం తన ఉనికిని పెంచుకుంటూ ఉత్తర, మధ్య అరేబియా సముద్రం నుంచి ఏడెన్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో మెరైన్ కమాండోలతో దాదాపు 10 ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలను (Indian Navy Warships Deployed in Arabian Sea) మోహరించిందని అధికారులు శుక్రవారం తెలిపారు.
Indian Navy Warships Deployed in Arabian Sea: పైరసీ, డ్రోన్ దాడులను అరికట్టేందుకు భారత నావికాదళం తన ఉనికిని పెంచుకుంటూ ఉత్తర, మధ్య అరేబియా సముద్రం నుంచి ఏడెన్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో మెరైన్ కమాండోలతో దాదాపు 10 ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలను (Indian Navy Warships Deployed in Arabian Sea) మోహరించిందని అధికారులు శుక్రవారం తెలిపారు.
6-10 ప్రధాన స్వదేశీ ఇండియన్ నేవీ యుద్ధనౌకలు, సెస్ట్రాయర్‌లు, యుద్ధనౌకలు, ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ ఓడలు, అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో సోమాలియా తీరానికి సమీపంలో ప్రత్యేక దృష్టి సారించి వ్యాపార నౌకలపై పైరసీ, డ్రోన్ దాడులను నిరోధించడానికి ఇవి రెడిగా ఉన్నాయని నేవీ అధికారులు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సముద్రంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా భారత యుద్ధ నౌకలు పరిస్థితిని గమనిస్తున్నాయి. అరేబియా సముద్రంలో భారతీయ వాణిజ్య నౌకలపై ఇటీవల వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో, సముద్రపు దొంగలను అరికట్టేందుకు భారత నావికాదళం ముందస్తుగా తమ నౌకాదళాన్ని మోహరిస్తున్నదని (India Deploys Warships in Arabian Sea) నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ బుధవారం తెలిపారు.
బుధవారం హైదరాబాద్‌లో తొలిసారిగా స్వదేశీ తయారీ దృష్టి 10 స్టార్‌లైనర్ మానవరహిత వైమానిక వాహనం (యుఎవి)ని ఆవిష్కరించిన అనంతరం నేవీ చీఫ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గత 42 రోజులలో, ఇటువంటి 35 దాడులు (సుమారుగా) జరిగాయి. అయితే, భారతదేశం జెండాతో ఉన్న ఏ నౌకపై ఇప్పటి వరకు దాడి జరగలేదు. ఇజ్రాయెల్ యాజమాన్యంలోని ఓడలపై జరిగాయి.మేము ఇప్పుడు, చాలా చురుగ్గా, సముద్రపు దొంగల అటాక్ చేయకుండా ఉండేలా మా యూనిట్లను అక్కడ మోహరిస్తున్నామన్నారు.
ఇప్పటివరకు భారతీయులు ఉండే ఓడలపై దాడులు కేవలం రెండు సంఘటనలు జరిగాయని, ఇది సముద్రపు యోధులను పైరసీ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రేరేపించిందని తెలిపారు. రెండు సంఘటనల్లోనూ భారతీయ జెండాలు లేని నౌకలు ఉన్నాయి. రెండవ సంఘటనలో ఓడలో భారతీయ సిబ్బంది ఉన్నారు. అందువల్ల నేవీ స్పందించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.