India Coronavirus: దేశంలో 96 లక్షల యాభై వేలకు చేరువలో కరోనా కేసులు, తాజాగా 36,011 మందికి కోవిడ్ పాజిటివ్, 482 మంది మృతితో 1,40,182కు చేరుకున్న మరణాల సంఖ్య

ఈ కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో 96,44,222 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి.

Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

New Delhi, December 6: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,011 కరోనా కేసులు (India Coronavirus) నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఈ కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో 96,44,222 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి.కరోనాతో 24 గంటల్లో దేశవ్యాప్తంగా 482 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,40,182కు (Covid Deaths) చేరింది.

కోవిడ్‌ నుంచి కొత్తగా 41,970 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 91,00,792గా ఉంది. ప్రస్తతం దేశంలో 4,03,248 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14,69,86,575 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది.

ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. కరోనా కేసుల నమోదులో వరుసగా మూడవరోజు కూడా 5 శాతం మేరకు తగ్గుదల కనిపించింది. దీనికితోడు రికవరీ రేటులోనూ మెరుగుదల కనిపించింది. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 3,419 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,89,544కు చేరింది.

కరోనా కారణంగా ఢిల్లీలో ఇప్పటివరకూ 9,574 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 4,916 మంది కోలుకున్నారు. దీంతో ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,53,292కు చేరింది. గడచిన 24 గంటల్లో 81,473 కరోనా టెస్టులు చేశారు. ఢిల్లీలో ఇప్పటి వరకూ మొత్తం 66,67,176 కరోనా టెస్టులు చేశారు.

మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే, ఫలితం తేలని ఐదో విడత చర్చలు, డిసెంబర్ 9న మరోసారి చర్చలు, 8వ తేదీన భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

దేశంలో అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో నిన్న కొత్తగా 4922 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 18,47,509కి చేరింది. మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.