Coronavirus In India: ఆరు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం, 50 వేలకు చేరువలో కరోనా కేసులు, దేశ వ్యాప్తంగా 1,694 మంది మృతి, 33,514 కరోనా యాక్టివ్‌ కేసులు

గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 2,958 కరోనా కేసులు నమోదు కాగా, 126 మంది మృతిచెందారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 14,182 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,694 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 33,514 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో కోలుకుంటున్న వారు 28.71 శాతం అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

COVID-19 In India (Photo-PTI)

New Delhi, May 6: దేశంలో కరోనా(COVID-19 In India) కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 2,958 కరోనా కేసులు నమోదు కాగా, 126 మంది మృతిచెందారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 14,182 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,694 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 33,514 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో కోలుకుంటున్న వారు 28.71 శాతం అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇండియన్ ఆర్మీలో 24 మందికి కరోనా పాజిటివ్, ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫ‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో ప‌నిచేస్తున్న‌ సైనిక దళాల‌కు సోకిన వైర‌స్

అత్యధికంగా మహారాష్ట్రలో 15,525 కరోనా (COVID 19) కేసులు నమోదు కాగా, 617 మంది మృతిచెందారు. ముంబైలోని ధారావిలో మాత్రమే 33 కొత్త కేసులు నమోదయ్యాయి, ఆసియాలో అతిపెద్ద మురికివాడలో మొత్తం 665 కేసులు మరియు 20 మరణాలు సంభవించాయి. గుజరాత్‌లో 6,245, ఢిల్లీలో 5,104, తమిళనాడులో 4,058, రాజస్తాన్‌లో 3,158, మధ్యప్రదేశ్‌లో 3,049, ఉత్తరప్రదేశ్‌లో 2,880 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఈ నెల ప్రారంభంలో, దేశంలో గరిష్టంగా COVID-19 కేసులు అధికంగా ఉన్న 20 జిల్లాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి 20 కేంద్ర ప్రజారోగ్య బృందాలను నియమించారు. ఆరోగ్య బృందాలను మోహరించిన అన్ని జిల్లాలె రెడ్ జోన్‌ పరిధికిందకు వస్తాయి. ఈ జిల్లాల్లో ముంబై, పూణే, థానే (మహారాష్ట్ర), అహ్మదాబాద్, సూరత్, వడోదర (గుజరాత్), ఇండోర్, భోపాల్ (మధ్యప్రదేశ్), జైపూర్, జోధ్పూర్ (రాజస్థాన్), చెన్నై (తమిళనాడు) మరియు హైదరాబాద్ (తెలంగాణ) ఉన్నాయి.  కోవిడ్-19కు వాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు! ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల హెచ్చరిక, వైరస్‌తోనే ఎలా జీవించాలో సమాజం నేర్చుకోవాలని సూచన

కేసుల సంఖ్య విషయంలో ఇండియా ప్రపంచ దేశాల జాబితాలో 15వ స్థానానికి (2020 Coronavirus Pandemic in India) చేరింది. సోమవారంతో పోలిస్తే 9.04 శాతం కేసులు పెరిగాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే, మంగళవారం నాడు 50,800 కొత్త కేసులు రాగా, మొత్తం 36,94,071 కేసులు నమోదైనట్లయింది. మొత్తం 2,55,596 మంది మరణించారు. ఇండియా విషయానికి వస్తే, మొత్తం కేసులు 46,711కు చేరగా, 1,583 మంది మరణించారు.