India's COVID-19: దేశంలో 34 లక్షలకు చేరువలో డిశ్చార్జ్ కేసులు, తాజాగా 89,706 మందికి కరోనా, కోవిడ్-19తో తాజాగా 1,115 మంది మృతితో 73,890కు చేరుకున్న మరణాల సంఖ్య
అదే సమయంలో 1,115 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 43,70,129కు (India's COVID-19 Tally) చేరగా, మృతుల సంఖ్య మొత్తం 73,890కు (Coronavirus Deaths) పెరిగింది.
New Delhi, September 9: దేశంలో గత 24 గంటల్లో దేశంలో 89,706 మందికి కరోనా (Coronavirus India) సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. అదే సమయంలో 1,115 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 43,70,129కు (India's COVID-19 Tally) చేరగా, మృతుల సంఖ్య మొత్తం 73,890కు (Coronavirus Deaths) పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 33,98,845 మంది కోలుకున్నారు. 8,97,394 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. మంగళవారం ఒకే రోజు 11,54,549 నమూనాలు పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 5,18,04,677 శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
కొవిడ్ కేసుల్లో మహారాష్ట్రలోని పూణె దేశంలోనే రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన తొలి జిల్లాగా రికార్డులకెక్కింది. మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కథనం ప్రకారం.. పూణె జిల్లాలో సోమవారం కొత్తగా 4,165 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,03,468కు పెరిగింది. ఆగస్టు 4న లక్ష కేసుల మార్కును దాటిన పూణె నెల రోజుల వ్యవధిలోనే మరో లక్ష కేసులకు చేరుకోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
ఢిల్లీలో సోమవారం నాటికి 1,93,526 కేసులు నమోదు కాగా, ముంబైలో 1,57,410 కేసులున్నాయి. పూణెలో కరోనా పాజిటివిటీ రేటు 22 శాతంగా ఉన్నట్టు కలెక్టర్ రాజేశ్ దేశ్‌ముఖ్ తెలిపారు. ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తూ కేసుల విషయంలో పూణె జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.