IPL Auction 2025 Live

Coronavirus in India: దేశంలో తాజాగా 26,567 కరోనా కేసులు నమోదు, 385 మంది మృతితో 1,40,958కు చేరుకున్న మరణాల సంఖ్య, కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి కావాలని కోరుతూ భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు

385 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 97,03,770కు చేరింది. 1,40,958 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 3,83,866 యాక్టివ్ కేసులుండగా.. కరోనా చికిత్స (COVID-19 Pandemic) నుంచి కోలుకుని 91,78,946 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Coronavirus in AP (Photo Credits: PTI)

New Delhi, December 8: భారత దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,567 కరోనా కేసులు (Coronavirus in India) నమోదు కాగా.. 385 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 97,03,770కు చేరింది. 1,40,958 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 3,83,866 యాక్టివ్ కేసులుండగా.. కరోనా చికిత్స (COVID-19 Pandemic) నుంచి కోలుకుని 91,78,946 మంది డిశ్చార్జ్ అయ్యారు.

కాగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.59 శాతం కాగా.. మరణాల రేటు 1.45 శాతంగా ఉందని మంగళవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.సోమవారం దేశవ్యాప్తంగా ఒకే రోజు 10,26,399 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 14,88,14,055 నమూనాలను టెస్ట్‌ చేసినట్లు వివరించింది.

కరోనావైరస్ సెకండ్ వేవ్ ఛాయలు కనపడుతున్న నేపథ్యంలో కొవాగ్జిన్‌ పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ కేంద్ర డ్రగ్‌ రెగ్యులేటర్‌కు దరఖాస్తు చేసింది. ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. కొవాగ్జిన్‌ టీకాను ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే టీకా మూడో విడత ట్రయల్స్‌లో జరుగుతున్నాయి.

వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతుల పోరు, కొనసాగుతున్న భారత్ బంద్, నిర్మానుష్యంగా మారిన ఢిల్లీ సరిహద్దులు, నోయిడాలో 144 సెక్షన్, పోలీసులు భారీ బందోబస్త్, బంద్‌కు మద్దతు ప్రకటించిన పలు సంఘాలు

దేశవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో 22వేల మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే తొలి, రెండో దశల్లో టీకా మెరుగైన ఫలితాలు రావడంతో డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా మూడో విడత ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. ట్రయల్స్‌ విజయవంతమైతే తర్వాత వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేయనున్నారు.