Coronavirus in India: పెరుగుతున్న రికవరీ రేటు, దేశంలో 19 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, గత 24 గంటల్లో 57,982 కొత్త కేసులు నమోదు, 26,47,664 కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

తాజాగా 941 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 50,921 కి (Coronavirus Deaths) చేరింది. తాజాగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 26,47,664 కు చేరింది. ప్రస్తుతం 6,76,900 మంది వైరస్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 19,19,843 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 7 లక్షల 30 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో.. మొత్తం పరీక్షల సంఖ్య మూడు కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

COVID-19 in India (Photo Credits: PTI)

Mumbai, August 17: దేశంలో గత 24 గంటల్లో 57,982 కొత్త కేసులు నమోదడంతో మొత్తం కేసుల సంఖ్య (Coronavirus in India) 26 లక్షలు దాటింది. తాజాగా 941 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 50,921 కి (Coronavirus Deaths) చేరింది. తాజాగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 26,47,664 కు చేరింది. ప్రస్తుతం 6,76,900 మంది వైరస్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 19,19,843 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 7 లక్షల 30 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో.. మొత్తం పరీక్షల సంఖ్య మూడు కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

ఆగ‌స్టు 16న 7,31,697 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, నిన్న‌వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 3,00,41,400 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా ప‌రీక్ష‌లు మూడు కోట్ల మార్కును దాటాయ‌ని తెలి‌పింది.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సోమవారం మరో ఎమ్మెల్యే కొవిడ్-19తో మరణించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సమరేష్ దాస్ సోమవారం కరోనాతో మరణించారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఈగ్రా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సమరేష్ దాస్ కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో కరోనాతో మరణించిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది. ఎమ్మెల్యే సమరేష్ దాస్ మృతి తీరని లోటని, ఆయనకు సీఎం మమతాబెనర్జీ సంతాపం తెలిపారు. ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల జెండా, జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, నియంత్రణ రేఖ నుంచి వాస్తవాధీన రేఖ వరకు భారత సార్వభౌమత్వాన్ని ఎవరూ సవాలు చేయలేరని వ్యాఖ్య

యూపీలో ప్రభుత్వ షెల్టరు హోమ్‌లో 90 మంది బాలికలకు కరోనా సోకిన ఘటన బరేలీ పట్టణంలో వెలుగుచూసింది. బరేలీ పట్టణంలోని నారీ నికేతన్‌లో నివాసముంటున్న 90 మంది బాలికలకు కరోనా పాజిటివ్ అని తేలిందని మహిళా సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టరు నీతా అహిర్వార్ చెప్పారు. కరోనా సోకిన బాలికలందరినీ ఐసోలేషన్ చేశామని నీతా చెప్పారు. నారీ నికేతన్ లో బాలికలకు కరోనా ఎలా సోకిందన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నారీ నికేతన్ ను శానిటైజ్ చేయించారు.