Chandipura Virus Alert(X)

బీజింగ్, జనవరి 3: ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ తరహాలోనే మరో వైరస్ చైనాను వణికిస్తోంది. తం అక్కడ హ్యూమన్‌ మెటాప్న్యూమోవైరస్‌ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందుతోందని చైనా ఆరోగ్యశాఖ వెల్లడించింది. హెచ్‌ఎమ్‌పీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్‌ -19 వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

2001లోనే గుర్తించిన హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (HMPV) కేసులు చైనా ఉత్తర ప్రాంతంలో పెరుగుతున్నట్లు చైనా నివేదించింది. కేవలం చైనా ఉత్తర భాగంలోనే హెచ్‌ఎంపీవీ విజృంభణ కొనసాగుతోందని అటు చైనా ఆరోగ్య శాఖ.. ఇటు చైనా అంటువ్యాధుల నియంత్రణ మండలి(China CDC) ప్రకటించాయి. అన్ని వయసులవాళ్లపై ఈ వైరస్‌ ప్రభావం చూపుతోందని.. ముఖ్యంగా పిల్లల్లో, వయసు పైబడినవాళ్లలో త్వరగా వ్యాపిస్తోందని చెబుతున్నారు.

చైనాలో అత్యవసర పరిస్థితి మాట అనేది వాస్తవం కాదు, కోవిడ్ కేసులతో ఆస్పత్రులు నిండిపోయాయనే దానిపై ఫ్యాక్ట్ చెక్ ఇదే..

ప్రస్తుతం కేసులను ట్రేస్‌ చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నాయి. అలాగే మాస్కులు ధరించాలని, శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపాయి. అయితే.. ఇది ప్రాణాంతకమేనా? అనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పరిణామంపై ఇంకా స్పందించ లేదు. ఇక చైనా చుట్టుపక్కల ఉన్న జపాన్‌లో ఫ్లూ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండగా.. HMPV కేసులేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హంకాంగ్‌లోనూ ఈ వైరస్‌ కేసులు నమోదు అయినట్లు సమాచారం.

హెచ్‌ఎంపీవీ వైరస్‌ అంటే ఏమిటి ?

దీని సంక్షిప్త నామం హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌. ఇది క్షీరదాలు, పక్షుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని కలగజేసే Pneumoviridae Metapneumovirusకి చెందింది. 2021లో తొలిసారిగా ఈ వైరస్‌ ఆనవాళ్లను శ్వాసకోశ సంబంధిత సమ్యలతో బాధపడుతున్న చిన్నపిల్లల్లో డచ్‌ పరిశోధకులు గుర్తించారు. అయితే ఎలా సోకుతుందని(వ్యాధికారకం) విషయం గుర్తించలేకపోగా.. ఇప్పటిదాకా దీనికి వ్యాక్సిన్‌, మందులు సైతం కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. సెరోలాజికల్‌ అధ్యయనాల ప్రకారం ఈ వైరస్‌ 60 ఏళ్లు భూమ్మీద సజీవంగానే ఉండి తన ప్రభావం చూపిస్తుందని తేలింది.

నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ లక్షణాలు

హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ లక్షణాలు (HMPV virus Symptoms) ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారిన పడే అవకాశాలు ఎక్కువ.ఇన్‌ఫెక్షన్ తీవ్రతను బట్టి లక్షణాలు వేర్వేరు వ్యవధిలో ఉంటాయి.

హెచ్‌ఎంపీవీ వైరస్‌ ఎలా వ్యాప్తిస్తుంది

కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్‌ ఈజీగా సోకుతుంది.అలాగే దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లు, వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం, తాకడం వంటి చర్యలు, వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన తర్వాత నోరు, ముక్కు, కళ్లను తాకితే ఈ వ్యాధి వ్యాపిస్తుంది. పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

నివారణా చర్యలు ఏమిటి ?

చేతులను తరచూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం వంటివి చేయాలి.. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రద్దీ ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండడం వంటివి తప్పనిసరిగా పాటించాలి. వైరస్ బారినపడిన వ్యక్తులకు దూరం పాటించాలి. వైరస్ సోకిన వ్యక్తులు తమ వస్తువులను ఇతరులతో పంచుకోకుండా చూసుకోవాలి.

హెచ్‌ఎంపీవీతో మరణాలు సంభవిస్తాయా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. 2021లో ఈ వైరస్‌ డాటా ఆధారంగా లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఓ కథనం ప్రచురించింది. అందులో.. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఒక శాతం మరణాలు సంభవించిన విషయాన్ని ప్రస్తావించింది.