India's tallest structure Noida Supertech Twin Towers to be demolished at 2:30 pm today: టిక్‌ టిక్‌ టిక్‌.. నోయిడా జంట భవనాల కూల్చివేత.. ఉత్కంఠతో ఎదురు చూస్తున్న యావత్తు దేశం..

నోయిడా జంట భవనాల కూల్చివేత..

Noida, August 28: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్‌ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేతకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల్లో దడ, యావత్తు దేశ ప్రజానీకంలో ఉత్కంఠ మొదలైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ జంట భవనాలను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క బటన్‌ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 10 సెకండ్లలోపే పేకమేడల్లా నేలమట్టం కానున్నాయి.  భవనాల కూల్చివేతను చేపట్టిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థ సీఈఓ ఉత్కర్‌ మెహతా శనివారం పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూల్చివేతపై ఎలాంటి భయాలు వద్దని తాము చేపట్టిన ప్రక్రియ పూర్తి సురక్షితమైనదని హామీ ఇచ్చారు.

జంట భవనాలపై సంక్షిప్త సమాచారం

నోయిడా జంట భవనాల నిర్మాణం : 2012

రెండు జంట భవనాలు : అపెక్స్‌ (32 అంతస్తులు), సియాన్‌ (29 అంతస్తులు)

భవనాలకు చేసిన రంధ్రాలు : 9,600

నింపిన పేలుడు పదార్థాలు : 3,700 కేజీలకు పైగా

టవర్స్‌ నిర్మాణ వ్యయం : రూ.70 కోట్లు

కూల్చివేతకు ఖర్చు : రూ.20 కోట్లు

శిథిలాలు : 55,000 నుంచి 80 వేల టన్నులు

శిథిలాల తరలింపునకు పట్టే సమయం: 3 నెలలు



సంబంధిత వార్తలు

Traffic Restrictions in Cyberabad: సైబ‌రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, సైబ‌ర్స్ ట‌వ‌ర్స్ నుంచి వెళ్లే వారికి ప్ర‌త్యామ్నాయ మార్గాలివే!

BSNL 4G Network Ready: బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వ‌ర్క్ సిద్ధం, త్వ‌ర‌లోనే ల‌క్ష 4జీ ట‌వర్లు నిర్మిస్తామ‌న్న కేంద్ర‌మంత్రి, అక్టోబ‌ర్ వ‌ర‌కు 80వేల ట‌వ‌ర్ల నిర్మాణం పూర్తి

Andhra Pradesh: టెక్నాలజీ రంగంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌టవర్లను ప్రారంభించిన సీఎం జగన్

Afghanistan Earthquake: ఆఫ్ఘానిస్థాన్‌ లో గంట వ్యవధిలో ఆరు భూకంపాలు.. 2000 మందికి పైగా దుర్మరణం, 5000 మందికి పైగా గాయాలు.. డజనుకు పైగా గ్రామాలు నేలమట్టం.. పాపువా న్యూగినియా, మెక్సికో, నేపాల్‌లో కూడా భూకంపాల అలజడి