MP Shocker: భర్త పాడు బుద్ది, భార్యతో అసహజ సెక్స్, ఆ తర్వాత రూ. కోటి ఇవ్వాలని బ్లాక్ మెయిల్, లేకుంటే వీడియోలు సోషల్ మీడియోలో షేర్ చేస్తానంటూ భార్యకు బెదిరింపులు
కట్టుకున్న భార్యతో అసహజ శృంగారంలో పాల్గొన్న భర్త.. తాను చేసిన పాడుపనిని వీడియో తీసి పైశాచికానందం (unnatural sex videos with wife) పొందాడు
Indore, July 8: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యతో అసహజ శృంగారంలో పాల్గొన్న భర్త.. తాను చేసిన పాడుపనిని వీడియో తీసి పైశాచికానందం (unnatural sex videos with wife) పొందాడు. ఆ తర్వాత తనకు కోటి రూపాయల కట్నం ఇవ్వాలని లేనిపక్షంలో ఈ వీడియోను సోషల్ మీడియోలో షేర్ చేస్తానంటూ భార్యను బెదిరించాడు. పైగా, డబ్బు కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులను తట్టుకోలేని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగింది.
అసహజ శృంగారం చేస్తూ (unnatural sex) తనను ఇబ్బంది పెట్టాడని, నగ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని లసుడియా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. రూ.కోటి రూపాయలు ఇవ్వకపోతే ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
పైగా, తన భర్తకు అత్తమామలు కూడా సహకరిస్తున్నారని వారిపై కూడా కేసు (Man booked for videotaping) పెట్టింది. బాధితురాలి భర్త.. స్వస్థలం కాన్పుర్ కావడం వల్ల ఈ కేసును పోలీసులు అక్కడికి బదిలీ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.