Indore, June6: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు (Madhya Pradesh Shocker) చేసుకుంది. గత నాలుగేండ్లుగా మైనర్ కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్నఓ కిరాతక తండ్రిని (35) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు విదేశాల్లో నివసిస్తూ స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిసేందుకు ఏడాదికి ఒకటి రెండు సార్లు వస్తుంటాడు. శుక్రవారం రాత్రి కూడాబాలికపై అత్యాచారానికి ( Man held for raping minor daughter) పాల్పడ్డాడు. కాగా బాలిక శనివారం నొప్పితో బాధపడుతుండగా తల్లి అడగటంతో జరిగిన విషయం వెల్లడించింది. బాయ్‌ఫ్రెండ్ చీటింగ్, కోపంతో ప్రియుడిని కారుతో గుద్ది చంపిన ప్రియురాలు, యుఎస్‌లోని ఇండియానాపోలిస్‌లో ఘటన
బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆపై జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. గత నాలుగేండ్లుగా కూతురిని బెదిరించి నిందితుడు అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని ఖర్జానా పోలీసులు వెల్లడించారు