Insurance Scam: రూ.300 కోట్ల లంచం ఆరోపణలు, ఇన్సూరెన్స్‌ కుంభకోణంలో జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ నోటీసులు

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన రూ.300 కోట్ల లంచం ఆరోపణల కేసులో సాక్షిగా ఆయనను ప్రశ్నించనున్నది

Satya Pal Malik. (Photo Credits: Instagram)

జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్‌ (Satya Pal Malik) కు సీబీఐ సమన్లు జారీ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన రూ.300 కోట్ల లంచం ఆరోపణల కేసులో సాక్షిగా ఆయనను ప్రశ్నించనున్నది. దీని కోసం ఈ నెల 27 లేదా 28న తమ కార్యాలయానికి రావాలంటూ ఆయనకు నోటీసులు పంపింది.

కరోనాపై అలసత్వం వద్దు, 8 రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం, ప్రారంభ దశలోనే కేసుల పెరుగుదలను నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచన

జమ్ముకశ్మీర్‌లోని కిరు జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వర్తించే రూ.2,200 కోట్ల గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో అమలు చేశారు.అయితే నాటి గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఈ స్కీమ్‌ను ఒక్క నెలలోనే రద్దు చేశారు. ఈ స్కీమ్‌లో అవినీతి లొసుగులు ఉన్నాయని, ఫైల్ ఆమోదం కోసం తనకు రూ.300 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.

పుల్వామా దాడి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగింది, ప్రధాని మోదీపై జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు..

ఈ ఘటనపై గత ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. అందులో ఒకటి పైన చెప్పుకున్న ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ది కాగా, రెండోది జమ్ము కశ్మీర్‌ దాదాపు రూ.2,200 కోట్ల వ్యయంతో చేపట్టిన కిరూ హైడ్రాలిక్‌ పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలు.  రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్స్యూరెన్స్ బ్రోకర్లను నిందితులుగా పేర్కొంది. గత ఏడాది అక్టోబర్‌లో సత్యపాల్‌ మాలిక్‌ను సీబీఐ ప్రశ్నించింది.తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసింది.

రిలయెన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్‌ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందని సత్యపాల్ మాలిక్ ఏప్రిల్ 14న కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనికి ముందు, డీబీ లైవ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మాలిక్ ఈ ప్రస్తావన చేశారు. ఈ లైవ్ ప్రసారం కాగానే సత్యపాల్ మాలిక్‌కు రామ్ మాధవ్ పరువునష్టం నోటీసు పంపారు