జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారక ముందు ఆ రాష్ట్రానికి చివరి గవర్నర్‌గా పనిచేసిన సత్యపాల్ మాలిక్ తన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ది వైర్ సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సత్యపాల్ మాలిక్ పుల్వామా దాడి సమయంలో, CRPF హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి 5 హెలికాప్టర్లను కోరిందని, అవి ఇవ్వలేదని పేర్కొన్నారు. మా పొరపాటు వల్లే ఇలా జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పినప్పుడు మీరు మౌనంగా ఉండండి అని హెచ్చరించినట్లు తెలిపారు. ఇంటర్వ్యూలో, సత్యపాల్ మాలిక్ మరిన్ని ట్లాడుతూ, "సిఆర్‌పిఎఫ్ తమ జవాన్లను రవాణా చేయడానికి 5 హెలికాప్టర్లను కోరింది, ఎందుకంటే ఇంత పెద్ద కాన్వాయ్ ఎప్పుడూ రోడ్డు మార్గంలో వెళ్లదు. హోం మంత్రిత్వ శాఖను అడిగితే వారు నిరాకరించారు.’’ అని ఆయన అన్నారు.
పుల్వామా దాడి అనంతరం ప్రధాని మోదీతో ‘ ఇదంతా మన పొరపాటు వల్లే ఇలా జరిగిందని చెప్పానని, హెలికాప్టర్ లు ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదని చెప్పగా, తనను మౌనంగా ఉండమని చెప్పినట్లు సత్యపాల్ మలిక్ పేర్కొన్నారు.
పుల్వామా దాడి మోడీ వల్లే జరిగింది-జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్
పుల్వామా దాడి జరిగినప్పుడు జవాన్లని తీసుకెళ్ళడానికి సీఆర్పీఎఫ్ జవాన్లు రాజ్‌నాథ్ సింగ్‌ను 5 హెలికాప్టర్లు అడిగితే ప్రభుత్వం నిరాకరించింది
ఈ విషయంపై మోడీ, అజిత్ దోవల్ ఇద్దరూ నన్ను మాట్లాడొద్దు అన్నారు pic.twitter.com/avVNXUg15G
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2023
అంతేకాదు 'ప్రధానమంత్రి మోదీకి అవినీతి అంటే అంతగా ద్వేషం లేదు' అని ఈ ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. ‘ప్రధాని అవినీతిని అంతగా ద్వేషించరని నేను నిశ్చయంగా చెప్పగలను. అని పేర్కొన్నారు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
సత్యపాల్ మాలిక్ ఆరోపణల అటు కేంద్రంపై, ప్రధాని మోదీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాటలను తొక్కిపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే నిజాన్ని అణచివేయలేరని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు.