Bharat Gaurav Train: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్‌ నుంచి భారత్‌ గౌరవ్‌ రైలు, పూర్తి వివరాలు ఇవిగో..

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది.

IRCTC

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్ర (Sabarimala Yatra)కు  వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతీయ రైల్వే సికింద్రాబాద్‌ (Irctc Sabarimala Package From Hyderabad) నుంచి శబరిమలకు యాత్ర కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. నవంబర్‌ 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన బ్రోచర్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ సోమవారం ఆవిష్కరించారు.

ఈ భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా నడవనుంది. సికింద్రాబాద్‌, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఈ రైలు యాత్రికులు ఎక్కేందుకు అవకాశం కల్పించారు. శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం, ఎర్నాకుళం చోటానిక్కర్‌ అమ్మవారి ఆలయాలను (Sabarimala to ernakulam distance) కవర్‌ చేస్తూ సాగే ఈ యాత్ర మొత్తం నాలుగు రాత్రుళ్లు, ఐదు పగళ్లు కొనసాగుతుంది. యాత్రికులు టూటైర్‌ ఏసీ, త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. టికెట్‌ ధరలు రూ.11,475 నుంచి ప్రారంభమవుతాయని ఇండియన్ రైల్వే తెలిపింది. ఈ  రైలులో మొత్తంగా  716 సీట్లు (స్లీపర్‌ 460, థర్డ్‌ ఏసీ 206, సెకండ్‌ ఏసీ 50 సీట్లు చొప్పున) ఉన్నాయి.

వీడియో ఇదిగో, అరుణాచలంలో 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణని అంగప్రదక్షిణతో పూర్తి చేసిన భక్తుడు

నవంబర్‌ 16న ఉదయం 8గంటలకు ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. తరువాతి రోజు రాత్రి 7గంటలకు కేరళలోని చెంగనూర్‌కు చేరుకుంటుంది. అక్కడ దిగి రోడ్డు మార్గంలో నీలక్కళ్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సొంతంగానే కేరళ ఆర్టీసీ బస్సుల్లో పంబ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. మూడో రోజు దర్శనం, అభిషేకం (sabarimala booking) పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 1గంట వరకు నీలక్కళ్‌నుంచి చోటానిక్కర/ఎర్నాకుళం వచ్చి రాత్రి బస చేస్తారు. నాలుగో రోజు ఉదయం 7గంటలకు చోటానిక్కర అమ్మవారి (Chottanikkara temple ) ఆలయాన్ని దర్శించుకొని.. రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఎర్నాకుళం టౌన్‌లో మధ్యాహ్నం 12గంటలకు రైలు బయల్దేరుతుంది. ఐదో రోజు రాత్రి 9.45గంటలకు తిరిగి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

ప్యాకేజీ ఛార్జీల వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

ఎకానమీ (SL) కేటగిరీలో ఒక్కో టికెట్‌ ధర (irctc sabarimala package) రూ.11,475; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులైతే రూ.10,655 చెల్లించాలి.

స్టాండర్డ్‌ (3AC)కేటగిరీలో రూ.18,790; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులైతే  రూ.17,700

కంఫర్ట్‌ (2AC) కేటగిరీలో రూ.24,215; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులైతే రూ.22,910 చొప్పున చెల్లించాలి.

ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బందే చూసుకుంటారు.

యాత్రికులకు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.

పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే మాత్రం వ్యక్తులే చెల్లించుకోవాల్సి ఉంటుంది.

పుణ్యక్షేత్రాల్లో స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.

ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించాని భారతీయ రైల్వే కోరింది.