Jabalpur Hospital Fire: ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, ఒక్కసారిగా ఎగసిన మంటలు, 10 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చౌహాన్

ఉవ్వెత్తున ఎగిసినపడిన మంటలకు 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.

Jabalpur Hospital Fire (Photo Credits: IANS Twitter)

Bhopal, August 1: మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసినపడిన మంటలకు 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. మిగిలిన వార్డుల్లోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిమ్‌లోకి వెళ్లి ఆప్ కౌన్సిలర్‌ని తుఫాకీతో కాల్చిన దుండగుడు, శరీరంలోకి బుల్లెట్ దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన మహమ్మద్ అక్బర్

జబల్‌పూర్‌, దమోనాకా ప్రాంతంలోని న్యూలైఫ్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్పీ సిద్ధార్థ్‌ బహుగుణా తెలిపారు. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు చెప్పారు. ఆసుపత్రిలో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో అగ్నిప్రమాదంపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.