Jammu and Kashmir: జమ్మూలో లోయలో పడిన బస్సు, ఎనిమిది మంది మృతి, పలువురికి గాయాలు, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
గురువారం తెల్లవారుజామున ప్రయాణికులతో థాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు మార్గం మధ్యలో అదుపు తప్పి లోయలో (Mini Bus Falls into Gorge in Doda) పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు (8 Dead, Several Injured ) గాయపడ్డారు.
Doda, October 28: జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Jammu and Kashmir Accident) చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ప్రయాణికులతో థాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు మార్గం మధ్యలో అదుపు తప్పి లోయలో (Mini Bus Falls into Gorge in Doda) పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు (8 Dead, Several Injured ) గాయపడ్డారు. ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని పీఎంఓ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది.అదేవిధంగా జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కూడా మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.1 లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన చేసింది.