2025 Jeep Meridian: జీప్ ఇండియా నుంచి జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ కారు, ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల వరకు..

ఈ కారు ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది.

2025 Jeep Meridian

ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) తన ఎస్‌యూవీ కారు 2025 జీప్ మెరిడియన్ (2025 Jeep Meridian) ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. గత మోడల్ కారుతో పోలిస్తే బేస్ వేరియంట్ ధర రూ.6.24 లక్షలు తగ్గుతుందని చెబుతున్నారు. ఎంట్రీ లెవల్ లాంగిట్యూడ్ ట్రిమ్ మెరిడియన్ కారు మాత్రం ఐదు సీటర్ల ఆప్షన్ తో వస్తుండగా, మిగతా వేరియంట్లు 5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.

మారుతీ నుంచి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ వచ్చేసింది, ధర రూ. 6.49 లక్షల నుంచి ప్రారంభం

ఐదు లేదా ఏడు సీట్లతో సీట్లతో వస్తున్న మెరిడియన్ ఫేస్ లిఫ్ట్ కారులో అదనపు ఫీచర్లు జత చేశారు. ఆసక్తి గల కస్టమర్లు ఆన్ లైన్ లో గానీ, సమీప డీలర్ల వద్ద గానీ ప్రీ బుకింగ్స్ నమోదు చేసుకోవచ్చు. ఈ నెలఖారులో కార్ల డెలివరీ ప్రారంభం కానున్నది. జీప్ మెరిడియన్ 2025 కారు లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిలెడ్ (ఓ), ఓవర్ లాండ్ వేరియంట్లలో లభిస్తుంది.

జీప్ మెరిడియన్ 2025 ఫీచర్లు

ఫ్రంట్ గ్రిల్లె రీడిజైన్డ్,

క్రోమ్ స్టడ్స్ మీద గల సెవెన్ స్లాట్ గ్రిల్లెతో హానీ కాంబ్ మెష్,

18-అంగుళాల అల్లాయ్ వీల్స్,

స్లీక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్,

రాపరౌండ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్,

షార్క్ ఫిన్ ఎంటీనా, స్కిడ్ ప్లేట్లు

10.25 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్,

10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్,

9-స్పీకర్ల ఆల్పైన్ ఆడియో సిస్టమ్,

వైర్ లెస్ చార్జర్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో,

ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ,

డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్,

పనోరమిక్ సన్ రూఫ్,

పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు

సేఫ్టీ కోసం అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్,

ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్ విత్ కొల్లిషన్ మిటిగేసన్ బ్రేకింగ్,

లేన్ డిపార్చర్ వార్నింగ్ లేన్ కీప్ అసిస్ట్,

360 డిగ్రీ కెమెరా,

ఏబీఎస్ విత్ ఈబీడీ, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్,

హిల్ హోల్డ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్,

టీపీఎంఎస్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్,

2.0 లీటర్లు, 4 – సిలిండర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్,

6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్,

9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్