Jharkhand Exit Poll Result 2024: జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, ఓటర్లు ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపారంటున్న సర్వేలు
సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియగా..క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి.
Ranchi, Nov 20: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియగా..క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి. ఝార్ఖండ్‌లో కాషాయ పార్టీ వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు పలు సంస్థల సర్వేలు అంచనా వేశాయి.
జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలుండగా మెజార్టీ మార్కు 41 కావాలి. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్‌విలాస్) పార్టీ ఒకచోట పోటీ చేశాయి. విపక్ష కూటమి తరఫున జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేశాయి.
జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్
పీపుల్స్ పల్స్ : ఎన్డీయే కూటమి 46-58 స్థానాలు,జేఎంఎం కూటమికి 24-34 స్థానాలు, ఇతరులు 6-10 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
ఏబీపీ మ్యాట్రిజ్:ఎన్డీయే కూటమి 42-47 స్థానాలు, జేఎంఎం కూటమికి 25-30 స్థానాలు, ఇతరులు 1-14 స్థానాలు వస్తాయని తెలిపింది.
యాక్సిస్ మై ఇండియా: ఎన్డీయే కూటమి 25 స్థానాలు, జేఎంఎం కూటమికి 53 స్థానాలు, ఇతరులు 3 స్థానాలు అంచనా.
టైమ్స్ నౌ : ఎన్డీయే కూటమి 40-44 స్థానాలు,జేఎంఎం కూటమికి 30-40 స్థానాలు, ఇతరులు 1 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.