Mumbai, Nov 20: మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియగా..క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని ఎక్కువ పోల్ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ కూటమికి 130 నుంచి 160 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 120 నుంచి 140 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కాగా మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 145 మ్యాజిక్ ఫిగర్ దక్కిన పార్టీకి అధికారం దక్కనుంది.
అయితే 182 స్థానాలతో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అతి పెద్ద పార్టీగా అవతరించనుందని పీపుల్స్ పల్స్ తెలిపింది. శివసేన(ఏక్‌నాథ్‌షిండే) పార్టీ 42-61 స్థానాలు, ఎన్సీపీ అజిత్ పవార్ 14-25 స్థానాలు సాధించే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 24-44 స్థానాలు, శివసేన (యూబీటీ) 21-36 స్థానాలు, ఎన్సీపీ (శరద్ పవార్) 28-41 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది.
ఎగ్జిట్ పోల్స్ ఇవిగో..
పీ మార్క్ - బీజేపీ కూటమి: 137 నుంచి 157, కాంగ్రెస్ కూటమి: 126 నుంచి 146
పీపుల్స్ పల్స్ - బీజేపీ కూటమి: 182 ప్లస్, కాంగ్రెస్ కూటమి: 97 ప్లస్
ఏబీపీ-మ్యాట్రిజ్ - బీజేపీ కూటమి: 150 నుంచి 170, కాంగ్రెస్ కూటమి: 110 నుంచి 130
చాణక్య - బీజేపీ కూటమి: 150 నుంచి 160, కాంగ్రెస్ కూటమి: 130 నుంచి 138
సీఎన్ఎస్-న్యూస్ 18 - బీజేపీ కూటమి: 154, కాంగ్రెస్ కూటమి: 128