Jharkhand Horror: పనిమనిషిపై బీజేపీ నేత దారుణం, మూత్రం తాగాలని, నాలుకతో ఇంటిని శుభ్రం చేయాలంటూ నరకం, కేసు నమోదు చేసుకున్న జార్ఖండ్ పోలీసులు
రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి భార్య, బీజేపీ రాజకీయ నాయకురాలు సీమా పాత్ర (BJP leader Seema Patra ) రాంచీలోని తన నివాసంలో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న 29 ఏళ్ల మహిళను చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Ranchi, August 30: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి భార్య, బీజేపీ రాజకీయ నాయకురాలు సీమా పాత్ర (BJP leader Seema Patra ) రాంచీలోని తన నివాసంలో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న 29 ఏళ్ల మహిళను చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి.గుమ్లా జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన గిరిజన మహిళ సునీతగా గుర్తించిన ఇంటి పనిమనిషిని ఆగస్టు 22న మాజీ ఐఏఎస్ మహేశ్వర్ పాత్ర మరియు బీజేపీ నేత సీమా పాత్ర నివాసం నుంచి రక్షించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జార్ఖండ్ ప్రభుత్వ సిబ్బంది విభాగం అధికారి ఇచ్చిన సమాచారం మేరకు రాంచీ పోలీసులు ఆగస్ట్ 22న అశోక్ నగర్ లో ఉన్న బీజేపీ నాయకుడి నివాసం నుంచి ఆమెను రక్షించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. సునీత శరీరంలోని వివిధ భాగాల్లో పలుచోట్ల తీవ్ర గాయాలతో రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)లో చికిత్స పొందుతోంది.ఘటనకు సంబంధించి పోలీసు కేసు నమోదు చేయగా, చికిత్స అనంతరం ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
Here's Videos
సీమా నివాసం నుంచి రక్షించిన తర్వాత, బీజేపీ నాయకురాలు తనను తరచూ కొట్టేదని ఆమె అన్నారు. సీమా తనను బలవంతంగా మూత్రం తాగమని (forcing her to lick urine) చెప్పేదని, నాలుకతో నేలను శుభ్రం చేయించేదని, వేడి పాన్‌తో (branding maid with hot pan) తన పళ్లు విరగ్గొట్టిందని ఆమె ఆరోపించింది. ఆమె నన్ను ఇనుప రాడ్, బెల్టు మరియు గరిటెతో కొట్టేది. ఆమె నన్ను వేడి పాన్‌తో కూడా దారుణంగా కొట్టిందని సీమా పాత్ర హింసను వివరిస్తూ స్పష్టంగా మాట్లాడలేని సునీత అన్నారు.
సీమ తనకు ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదని, తనను గదిలో బంధించారని సునీత ఆరోపించింది.మహిళ దీనస్థితిలో ఉందని, నడవలేక, మాట్లాడలేని స్థితిలో ఉందని రిమ్స్‌లోని డాక్టర్ తెలిపారు. ఆమె కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు.అయితే, సీమ కొడుకు తన తల్లి క్రూరత్వం నుండి తనను కాపాడాడని, అతని వల్లనే ఆమె బతికి ఉందని సునీత చెప్పినట్లు నివేదికలు జోడించారు.
సునీతను పాత్రా దంపతులు పదేళ్ల క్రితం ఇంటి పని చేసేందుకు నియమించినట్లు సమాచారం. తరువాత, ఆమెను ఢిల్లీలో నివసిస్తున్న వారి కుమార్తె వత్సల పాత్రా వద్దకు పంపారు. వత్సల ఢిల్లీ నుండి బదిలీ అయినప్పుడు, సునీత తిరిగి రాంచీకి సీమ నివాసానికి వచ్చింది. సీమ తనను వేధించడం ప్రారంభించినప్పుడు, తన స్వగ్రామానికి వెళ్లేందుకు అనుమతి కోరిందని సునీత ఆరోపించింది. అయితే సీమా ఆమెను కొట్టి గదిలో బంధించిందని ఆరోపించారు.సునీతపై పోలీసులకు క్లూ ఇచ్చిన అధికారి ఫిర్యాదుపై రాంచీలోని అర్గోడా పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్లు 323, 325, 346, మరియు 374 మరియు ఎస్సీ-ఎస్టీ చట్టం, 1989 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.