జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్‌యూవీ కారు అదుపుతప్పి భారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 7 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ తలుపులు తెరుచుకోకపోవడంతో పేషెంట్ మృతి, కేరళలో విషాద ఘటన, దీనిపై దర్యాప్తు చేయాలని మంత్రి వీణా జార్జ్ ఆదేశాలు
వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.కిష్ఠ్‌వార్ జిల్లాలోని ఛట్రూ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. లోయ చాలా లోతుగా ఉండటంతో వాహనం పల్టీలు కొట్టుకుంటూ పడిపోయిందని, అందుకే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.