Joshimath Land Subsidence: దేవభూమిపై షాకిస్తున్న ఇస్రో చిత్రాలు, 12 రోజుల్లోనే 5.4 సె.మీ కుంగిపోయిన జోషిమఠ్ పట్టణం,కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు

ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం జోషీమ‌ఠ్ కుంగిపోతున్న (Joshimath Land Subsidence) విష‌యం తెలిసిందే.దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్ జోషిమఠ్ ప‌ట్టణంలోని (Joshimath) ప‌లు ప్రాంతాల్లో భూమి కోత‌కు గురికావ‌డం, ప‌గుళ్లతో భ‌యాన‌క ప‌రిస్థితి నెల‌కొంది.

Joshimath Land Subsidence (Photo-ANI)

Joshimath, jan 13: ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం జోషీమ‌ఠ్ కుంగిపోతున్న (Joshimath Land Subsidence) విష‌యం తెలిసిందే.దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్ జోషిమఠ్ ప‌ట్టణంలోని (Joshimath) ప‌లు ప్రాంతాల్లో భూమి కోత‌కు గురికావ‌డం, ప‌గుళ్లతో భ‌యాన‌క ప‌రిస్థితి నెల‌కొంది. పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా ఇప్పటివరకు 723భవనాలకు పగుళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఆరోగ్యం బాలేక ఆ వృద్ధురాలే మూత్రం పోసుకుంది, నేను మూత్ర విసర్జన చేయలేదని తెలిపిన శంకర్‌ మిశ్రా, 14 రోజుల కస్టడీకి నిందితుడు

ఇప్పటికే ప్రభుత్వం చాలా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రమాదకరంగా మారిన ఇళ్లు, భవనాలను కూల్చివేసిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ఇంటిని కూల్చలేదని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి శుక్రవారం తెలిపారు. సర్వే బృందం అక్కడ నెలకొన్న పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రమాద ప్రాంతం నుంచి ఇప్పటివరకు 99 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.

జోషిమఠ్ కొండచరియలు విరిగిపడటంపై సుప్రీంకు చేరిన కేసు, శంకరాచార్య పీఠంలోని శివలింగానికి పగుళ్లు, లోక వినాశనం అంటున్న పండితులు,

ఇక జోషిమఠ్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అద్దె సాయంగా రూ.5వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే 6 నెలల పాటు విద్యుత్ బిల్లులకు రాయితీ ఇవ్వనుంది. నవంబర్ 2022 నుంచి ఇది వర్తిస్తుంది. ఇళ్లు ఖాళీ చేసి హోటళ్లు, రిసార్టుల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న వారికి గదికి రూ.950 చొప్పున చెల్లించనుంది.

Here's ISRO Images

Here's Uttarakhand Minister Statement

ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉంటున్న వారికి ఒక్కొక్కరికి రూ.450 ఇవ్వనుంది. జోషిమఠ్‌లో ఇప్పటివరకు 169 కుటుంబాలకు చెందిన 589 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పగుళ్ల వల్ల తీవ్రంగా ప్రభావితమైన 42 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5లక్షలు తాత్కాలిక సాయంగా అందించింది.

జోషిమఠ్ గత 12 రోజుల్లోనే 5.4 సెంటిమీటర్లు (Joshimath sank 5.4cm in just 12 days) కుంగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఛాయాగ్రహ చిత్రాలను (Satellite images) విడుదల చేసింది. కార్టోశాట్‌-2ఎస్ శాటిలైట్ ఈ చిత్రాల‌ను తీసింది. ఇక్కడి పరిస్థితిపై కేంద్ర హొంమంత్రి అమిష్ షా గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందించాలని అధికారులకు సూచించారు.

జోషిమఠ్ మునిగిపోతున్న ఇస్రో యొక్క ఉపగ్రహ చిత్రాలపై ఉత్తరాఖండ్ మంత్రి ధన్ సింగ్ రావత్ స్పందించారు. ఇస్రో డైరెక్టర్‌తో మాట్లాడాను. ఇది తమ అధికారిక నిర్ణయం కాదని వారు అంగీకరించారు. ప్రస్తుత పరిస్థితిపై వారు ఈ రోజు తమ అధికారిక అభిప్రాయాన్ని తెలియజేస్తారని తెలిపారు.