Kaliaganj Minor's Death Case: కలియాగంజ్ మైనర్ బాలిక మృతి, రణరంగంగా మారిన బెంగాల్, రాజ్‌భవన్ ముట్టడించిన BJYM కార్యకర్తలు
బీజేవైఎం ఆందోళనకారులు పోలీసుల బారికేడ్‌ను బద్దలు కొట్టారు. కలియాగంజ్ మైనర్ మృతి కేసుకు నిరసనగా BJYM (భారతీయ జనతా యువ మోర్చా) సభ్యులు కోల్‌కతాలోని రాజ్‌భవన్‌కు పాదయాత్ర చేస్తున్నారు.
Kolkata, April 28: కలియాగంజ్ మైనర్ మృతి కేసుకు నిరసనగా BJYM (భారతీయ జనతా యువ మోర్చా) సభ్యులు కోల్‌కతాలోని రాజ్‌భవన్‌కు ముట్టడి చేశారు. బీజేవైఎం ఆందోళనకారులు పోలీసుల బారికేడ్‌ను బద్దలు కొట్టారు. కలియాగంజ్ మైనర్ మృతి కేసుకు నిరసనగా BJYM (భారతీయ జనతా యువ మోర్చా) సభ్యులు కోల్‌కతాలోని రాజ్‌భవన్‌కు పాదయాత్ర చేస్తున్నారు.
నిరసననకు కారణం ఏంటంటే.. కలియాగంజ్‌లో మైనర్ బాలిక మృతికి సంబంధించినది. ఏప్రిల్ 21న ఉత్తర దినాజ్‌పూర్‌లోని కలియగంజ్‌లోని గంగోవా గ్రామంలోని చెరువు నుండి 12వ తరగతి బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. ఆగ్రహించిన స్థానికులు పోలీసులు మృతదేహాన్ని వెలికితీయకుండా అడ్డుకున్నారు.ఇది ఆందోళనకు, నిరసనలకు దారి తీసింది. ప్రజలు రోడ్డు దిగ్బంధనం చేసి, టైర్లను తగులబెట్టారు. అనేక దుకాణాలకు నిప్పు పెట్టారు. స్థానికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది .
పోలీసులకు చూపుతున్నట్లు ఒక వీడియో కూడా వైరల్‌గా మారింది. పోస్ట్‌మార్టం కోసం తీసుకెళ్తుండగా బాధితురాలి మృతదేహాన్ని లాగారు. పోలీసులు మృతదేహాన్ని గ్రామం నుంచి ఈడ్చుకెళుతున్నట్లుగా వీడియోలో ఉంది. ఈ ఘటనపై స్పందించిన రాయ్‌గంజ్ పోలీస్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సనా అక్తర్.. బాడీ లాగిన కేసులో నలుగురు ASI లను సస్పెండ్ చేశారు. వారిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు.
పిటీ ఉషకు కౌంటర్ ఇచ్చిన శశి థరూర్, వారి గురించి తక్కువగా మాట్లాడడం అవమానకరంగా లేదా అంటూ ప్రశ్న
మృతదేహానికి సంబంధించిన పోస్ట్‌మార్టంలో ఉత్తర దినాజ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్, వైద్యులు అత్యాచారం జరగలేదని నిర్థారించారు. బాధితురాలి పోస్ట్‌మార్టం నివేదికలో విషపూరిత పదార్థం కారణంగా మరణం జరిగిందని వెల్లడైంది.పెద్ద గాయం లేదు. లైంగిక గాయం ఏదైనా ఉంటే స్పష్టం చేయడానికి మేము వైద్యులను మళ్లీ అడుగుతాము," అని సనా అక్తర్ తెలిపారు.
Here's Video
కలియాగంజ్ మైనర్ మర్డర్ కేసును త్వరగా విచారించాలన్న అభ్యర్థనను కలకత్తా హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. రెండు రోజుల క్రితం నార్త్ దినాజ్‌పూర్‌లోని కలియాగంజ్‌లో టీనేజ్ బాలిక మృతి కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణ కోరుతూ సోమవారం కలకత్తా హైకోర్టులో ఒక న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) సాక్ష్యం పోతుంది అనే భయాందోళనలను త్వరగా విచారించాలని లాయర్ కోరారు. ఈ కేసును బుధవారం విచారించాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు పిఐఎల్‌ను ఆమోదించింది. అయితే సత్వర విచారణ అభ్యర్థనను తిరస్కరించింది.
నేడు కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం డివిజన్ బెంచ్ ఈ కేసును నేడు విచారించింది.విచారణలో భాగంగా కలకత్తా హైకోర్టు గురువారం కలియాగంజ్‌లో మైనర్ బాలిక మృతిపై వచ్చే మంగళవారం నాటికి పశ్చిమ బెంగాల్ పోలీసుల నుండి నివేదిక కోరింది.జస్టిస్ రాజశేఖర్ మంథాతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది.
విచారణ సమయంలో, పోస్ట్ మార్టం యొక్క వీడియోగ్రఫీని భద్రపరచాలని కోర్టు కోరింది , అవసరమైతే కోర్టు దానిని తదుపరి తేదీలో పరిశీలిస్తుందని తెలిపింది.కోర్టు ఎఫ్‌ఐఆర్, పోస్ట్‌మార్టం నివేదికలను కూడా కోరింది. దాని కాపీని బాధితురాలి కుటుంబ సభ్యులకు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సభ్యునికి కూడా అందజేయాలని పోలీసులను కోరింది.కలిగంజ్‌లో నిషేధాజ్ఞలు విధించడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో కలిగంజ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
దీనికి తోడు గత రాత్రి పోలీసుల చేతిలో హత్యకు గురైన బంధువు బీజేపీ పంచాయతీ సభ్యుడు రాజ్‌బోన్షి యువకుడి మృతికి వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టింది. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలో బిజెపి నాయకుడి హత్య, కలియగంజ్ అత్యాచారం, హత్య కేసుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని కలియాగంజ్ సమీపంలోని రాధికాపూర్‌లో మృత్యుంజయ్ బర్మన్ . పోలీసుల కాల్పుల్లో మృత్యుంజయ్ మరణించారని బీజేపీ ఆరోపించింది .
పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా ఉత్తర బెంగాల్‌లో నేడు 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి ప్రభుత్వం రాజ్‌బంగ్షీ ప్రజలకు వ్యతిరేకమని బిజెపి నాయకురాలు దేబశ్రీ చౌదరి ఆరోపించారు.ఇక్కడ పరిస్థితిని చూసి మేము బంద్‌కు పిలుపునిచ్చాము. ఈ సంఘటన (బిజెపి నాయకుడి హత్య ఆరోపణ) చాలా సిగ్గుచేటు. రాజ్‌బంగ్షీ ప్రజలపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఇది టిఎంసి రాజ్‌బంగ్షీకి వ్యతిరేకంగా ఉందని చూపిస్తుంది" అని చౌదరి అన్నారు.