రెజ్లింగ్ స‌మాఖ్య చీఫ్ బ్రిజ్ భూష‌ణ్‌ను తొల‌గించాల‌ని మ‌హిళా రెజ్ల‌ర్లు ఢిల్లీలో మరోసారి ధ‌ర్నా చేస్తున్న విష‌యం తెలిసిందే. వీరిపై భార‌తీయ ఒలింపిక్ సంఘం అధ్య‌క్షురాలు పీటీ ఉష.. క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యానికి పాల్ప‌డుతున్నార‌ని, క‌మిటీ రిపోర్టు ఇచ్చే వ‌ర‌కు రెజ్ల‌ర్లు ఆగ‌లేద‌ని, నెగ‌టివ్ పంథాలో ధ‌ర్నాచేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

పీటీ ఉష వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor) కామెంట్ చేశారు. లైంగిక వేధింపుల‌కు గురైన అథ్లెట్లు ధ‌ర్నా చేస్తుంటే, వారి గురించి త‌క్కువ‌గా మాట్లాడ‌డం అవ‌మాన‌క‌రంగా లేదా అని శ‌శిథ‌రూర్ ప్ర‌శ్నించారు. రెజ్ల‌ర్లు వాళ్ల హ‌క్కుల కోసం పోరాటం చేయ‌డం వ‌ల్ల దేశ ప్ర‌తిష్ట‌కు న‌ష్టం క‌ల‌గదా అని అడిగారు. రెజ్ల‌ర్ల ఆందోళ‌న‌ల్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, వారి బాధ‌లు విన‌కుండా.. విచారించ‌డం స‌రికాదని ఎంపీ శ‌శి త‌న ట్వీట్‌లో తెలిపారు.

Here's Shashi Tharoor Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)