IPL Auction 2025 Live

Kanpur Encounter Case: పోలీసులకు చిక్కని గ్యాంగ్‌స్టర్, వికాస్ దూబే ఆచూకి తెలిపితే రూ. 5 లక్షల రివార్డు, ఢిల్లీ కోర్టులో లొంగిపోయేందుకు దూబే ప్రయత్నాలు

అతడిని పట్టించిన వారికి ప్రకటించిన రూ. 2.5 లక్షల రివార్డును ఏకంగా రూ. 5 లక్షలకు పెంచినట్టు అధికారులు వెల్లడించారు. ‘‘వికాస్ దూబే అరెస్టుపై ఉన్న నగదు రివార్డును రూ.5 లక్షలకు పెంచడం జరిగింది. అతడి ఆచూకీ చెప్పిన వారికి ఈ మొత్తాన్ని బహుమతిగా ఇస్తాం..’’ అని అదనపు చీఫ్ సెక్రటరీ అవనీశ్ కుమార్ అవస్తి వెల్లడించారు. ఈ నెల 3న కాన్పూర్‌లోని బిక్రులో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో (Kanpur Encounter) దూబే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

Vikas Dubey, Main Accused in Kanpur Encounter (Photo Credits: ANI)

Kanpur, July 8: యూపీలో ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న(Kanpur Encounter Case) ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేపై (Vikas Dubey) రివార్డును భారీగా పెంచుతూ యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతడిని పట్టించిన వారికి ప్రకటించిన రూ. 2.5 లక్షల రివార్డును ఏకంగా రూ. 5 లక్షలకు పెంచినట్టు అధికారులు వెల్లడించారు. ‘‘వికాస్ దూబే అరెస్టుపై ఉన్న నగదు రివార్డును రూ.5 లక్షలకు పెంచడం జరిగింది. వికాస్ దూబే ప్రధాన అనుచరుడిని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు, మరోసారి పోలీసుల నుంచి తప్పించుకున్న వికాస్‌ దూబే, 200 మంది పోలీసులపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు

అతడి ఆచూకీ చెప్పిన వారికి ఈ మొత్తాన్ని బహుమతిగా ఇస్తాం..’’ అని అదనపు చీఫ్ సెక్రటరీ అవనీశ్ కుమార్ అవస్తి వెల్లడించారు. ఈ నెల 3న కాన్పూర్‌లోని బిక్రులో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో (Kanpur Encounter) దూబే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

వికాస్‌ దూబే అత్యంత సన్నిహితుడు అమర్‌ దూబేను బుధవారం యూపీ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు కాల్చి చంపారు. వికాస్ దూబే పర్సనల్ బాడీ గార్డు కూడా అయిన అమర్‌ దూబేను హామీర్ పూర్‌లో ఎన్ కౌంటర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. గతవారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో అమర్‌ దూబే హస్తం కూడా ఉంది. ఇతనిపై 25 వేల రూపాయల రివార్డు ఉంది.

UP Police Increase Reward on Head of history-sheeter Dubey to Rs 5 lakh 

చౌబేపూర్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌ప్టర్‌కు చెందిన మరో సహచరుడైన శ్యామ్‌ బాజ్‌పాయ్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇక యూపీ, హర్యానా పోలీసులు సంయుక్తంగా వికాస్ దూబే కోసం మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌, గురుగ్రాం, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని పోలీసులు, ప్రజలను అప్రమత్తం చేశారు.

తనను పట్టుకొనేందుకు కాన్పూర్ పోలీసులు తీవ్రంగా గాలిస్తుండటంతో ఢిల్లీ కోర్టులో లొంగిపోయేందుకు వికాస్ దూబే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఢిల్లీకి సమీపంలోని ఓ పల్లెటూరులో ఉన్న వికాస్ దూబే.. కోర్టులో లొంగిపోయేందుకు సీనియర్ లాయర్ తో మంతనాలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.