Karnataka Bus Fire: మంటల్లో చిక్కుకున్న బస్సు, అయిదు మంది సజీవ దహనం, పలువురికి గాయాలు, కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హరియూరు దగ్గర విషాద ఘటన

ఓ ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగడంతో (Karnataka Bus Fire) ఐదుగురు సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ప్రైవేటు బస్సు బెంగళూరు నుంచి విజయపుర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Bengaluru bus fire (Photo Credits: ANI)

Bengaluru, August 12: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా (Chitradurga District) హరియూరు దగ్గర 4వ నంబర్ జాతీయ రహదారిపై (National Highway 4) బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగడంతో (Karnataka Bus Fire) ఐదుగురు సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ప్రైవేటు బస్సు బెంగళూరు నుంచి విజయపుర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 16 మంది మరణించగా,మరో నలుగురు గల్లంతయ్యారు. వరదల వల్ల మల్నాడ్, కర్ణాటక తీరప్రాంతాల్లో ఆస్తినష్టం సంభవించింది. 12 జిల్లాలు వరదబారిన పడటంతో 3,244 మంది బాధితులను 108 సహాయ పునరావాస శిబిరాలకు తరలించారు. వరదల వల్ల 28 జంతువులు మరణించాయి. మంటల్లో సజీవ దహనమైన 8మంది కరోనా రోగులు, అహహ్మదాబాద్‌ కోవిడ్-19 ఆసుపత్రిలో విషాద ఘటన

85 గృహాలు వరదలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 3,080 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 33,477 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. కొడగు ప్రాంతంలోని వరదనీటిలో పూజారి నారాయణ ఆచారి మృతదేహం లభించింది. బ్రహ్మగిరి వద్ద కొండచరియలు విరిగి పడి నలుగురు గల్లంతు అయ్యారు. ఉత్తర కన్నడ, బెల్గావీ జిల్లాల్లో వరద తగ్గుముఖం పట్టింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif