Ahmedabad, August 7: గుజరాత్ లో తీవ్ర విషాదం (Gujarat Fire) చోటు చేసుకుంది. అహమ్మాదాబాద్ లోని కోవిడ్-19 ఆసుపత్రిలో (COVID-19 Hospital) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది కరోనా రోగులు సజీవ దహనం కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. నవరంగపురలోని శ్రేయ్ ఆసుపత్రిలో (Shrey Hospital in Ahmedabad) గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు భారీగా మంటలు చెలరేగాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 8 మంది రోగులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో 35 మందిని ఇతర దవాఖానలకు తరలించారు.రికవరీ రేటు 67.19కి పెరిగిందని తెలిపిన ఆరోగ్య శాఖ, మృతుల శాతం 2.09కి తగ్గిందని వెల్లడి, దేశంలో 19 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు
చనిపోయిన వారిలో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. సుమారు 40 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదానికి కారణం తెలియరాలేదు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అహ్మదాబాద్ నగర బి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఎల్బీ జాలా తెలిపారు. చాలామందిని రక్షించినట్టు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
Here's ANI Tweet
Fire at Shrey Hospital in Ahmedabad: PM Narendra Modi announces ex-gratia of Rs 2 Lakhs each from Prime Minister's National Relief Fund (PMNRF) to the next of kin of the deceased. Rs 50,000 to be given to those injured due to the fire. #Gujarat https://t.co/KO3WHMkgH8 pic.twitter.com/kATkBezSxx
— ANI (@ANI) August 6, 2020
ఇదిలా ఉంటే అహ్మదాబాద్‌లోని శ్రేయ్ హాస్పిటల్‌లో చోటు చేసుకున్న ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ప్రార్థించారు.
Update by ANI
We are taking the help of fire and forensic experts in the investigation. A trustee of the hospital is being interrogated: Rajendra Asari, JCP, Sector 1, #Ahmedabad on Shrey Hospital fire incident which has claimed 8 lives#Gujarat pic.twitter.com/EeC2Mhwj00
— ANI (@ANI) August 6, 2020
శ్రేయ్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని హోంశాఖను ఆదేశించారు. హోంశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సంగీత సింగ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు.
అహ్మదాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో శ్రేయ్ హాస్పిటల్‌ను కరోనా దవాఖానగా మార్చారు. కాగా, అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు.