Screening for coronavirus | Representational image | (Photo Credits: PTI)

New Delhi, August 5: భారత్‌లో కోవిడ్-10 నుంచి కోలుకుంటున్న వారి శాతం మరింత పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో రికవరీ రేటు (India Covid Recovery Rate) 67.19కి పెరిగిందని, మృతుల శాతం (Corona Death Rate) 2.09కి తగ్గిందని ఆరోగ్య శాఖ (Health Ministry India) వివరించింది. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల (India Coronavirus Cases) సంఖ్య 19,08,255గా ఉందని, వీటిలో 5,86,244 యాక్టివ్ కేసులు (Corona Active Cases) ఉండగా, 12,82,216 మంది పూర్తి స్వస్థతతో డిశ్చార్జి అయినట్టు పేర్కొంది. మృతుల సంఖ్య 39,795కి చేరినట్టు ఆ ప్రకటన పేర్కొంది. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 52,509 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. వరుసగా ఏడో రోజు 50,000 పైబడి కేసులు నమోదు అయ్యాయి. కరోనావైరస్ జన్యువు వీక్ అవుతోంది, శుభవార్తను చెప్పిన ఇటలీ శాస్త్రవేత్తలు, దేశంలో కొత్తగా 52,509 మందికి కోవిడ్-19, భారత్‌లో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

4,57,956 కేసులతో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2,73,460 పాజిటివ్‌ కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ 1,76,333 కేసులతో మూడో స్థానంలో ఉంది. ఇక కర్ణాటకలో 1,45,830 మందికి కరోనా సోకింది. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,076 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కోవిడ్‌-19 కారణంగా తాజాగా 11 మంది మరణించారు. తాజా కేసులతో కలుపుకుని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,40,232కు చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 10,072. కోవిడ్‌-19 నుంచి ఇప్పటివరకు 1,26,116 మంది బాధితులు కోలుకున్నారు. ఢిల్లీలో కరోనాతో ఇప్పటివరకు 4,044 మంది చనిపోయారు.

Statement by Home Ministry: 

త‌మిళ‌నాడులో రోజూ వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. బుధ‌వారం కూడా కొత్త‌గా 5,175 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో త‌మిళ‌నాడులో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,460కి చేరింది. అందులో 2,14,815 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 54,184 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాకు మందేమి లేదు..ఎప్పటికీ రాకపోవచ్చు కూడా, కీలక వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌

ఇక, క‌రోనా మ‌ర‌ణాలు కూడా త‌మిళ‌నాడులో భారీగానే న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం కూడా కొత్త‌గా 112 మంది క‌రోనా బాధితులు ప‌రిస్థితి విష‌మించి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,461కి చేరింది. త‌మిళ‌నాడు ఆరోగ్యశాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.