New Delhi, August 5: కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో భారత్‌లో 52,509 మందికి కొత్తగా కరోనా (COVID-19 in India) సోకింది. అదే సమయంలో 857 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) ఇప్పటివరకు మొత్తం 19,08,255కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 39,795కి (Coronavirus deaths in india) పెరిగింది. కరోనాకు మందేమి లేదు..ఎప్పటికీ రాకపోవచ్చు కూడా, కీలక వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్
5,86,244 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 12,82,216 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,14,84,402 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ICMR) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 6,19,652 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
ఇండియాలో రికవరీ రేటు 66.30 శాతంగా ఉంది. కాగా 4,57,956 కేసులతో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2,68,285 పాజిటివ్ కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 1,76,333 కేసులతో మూడో స్థానంలో ఉంది. ఇక కర్ణాటకలో 1,45,830 మందికి కరోనా సోకగా.. ఢిల్లీలో 1,39,156 మంది వైరస్ బారిన పడ్డారు.
రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో గత 24 గంటల్లో 56,411 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 54 వేలకు పైగా పాజిటివ్ కేసులతో అమెరికా రెండో స్థానంలో ఉన్నది. రోజువారి మృతుల్లో కూడా భారత్ మూడో స్థానంలో కొనసాగుతున్నది. అమెరికా, బ్రెజిల్ దేశాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 580 మంది పోలీసులకు కరోనా, 2000 మంది స్వీయ నిర్భంధంలోకి, మధ్యప్రదేశ్‌లో కరోనా కల్లోలం
తాజాగా పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా సోకినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రసుత్తం ప్రధాన్ హరియాణాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమిత్ షాకు కూడా ఇదే ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్ మెంట్ జరుగుతుంది. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు యడియూరప్ప, శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వీరితో పాటు కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Here's Dharmendra Pradhan Tweet
#COVID19 के लक्षण दिखने पर मैंने टेस्ट करवाया जिसमें मेरी रिपोर्ट पॉज़िटिव आई है। डाक्टरों की सलाह पर मैं अस्पताल में भर्ती हूँ और स्वस्थ हूँ।
— Dharmendra Pradhan (@dpradhanbjp) August 4, 2020
ఇదిలా ఉంటే కొవిడ్ వ్యాక్సిన్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న శాస్త్ర ప్రపంచానికి ఇటలీ శాస్త్రవేత్తలు శుభవార్తను అందించారు. కరోనా వైర్‌స్లో జన్యుమార్పులు తగ్గుముఖం పట్టాయని ఇటలీలోని బోలోగ్నా వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వివిధ దేశాల నుంచి సేకరించిన 48,635 వైరస్ జన్యువుల విశ్లేషణ అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు తెలిపారు. గత అధ్యయనాల్లో కరోనా వైర్‌సలో ఆరు జన్యుమార్పులు జరిగాయని గుర్తించగా, తాజాగా ఆ సంఖ్య అతిస్వల్పంగా పెరిగి ఏడుకు చేరినట్లు గుర్తించారు.
కరోనా వల్ల నాడీ కండరాల సమస్య ఉత్పన్నమవుతుందని, ఒకవేళ గతంలో ఆ సమస్య ఉంటే.. కరోనా వైద్యంలో భాగంగా రోగ నిరోధక శక్తిని పెంచే చికిత్స వల్ల నాడీ కండరాల సమస్య మరింత ఎక్కువ అవుతుందని ఒక పరిశోధన తేల్చింది. కరోనా ప్రారంభం నుంచి జూన్ 18 వర కూ వివిధ జర్నల్స్‌లో ప్రచురితమైన 547 పత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ విషయం వెలుగు చూసిందని అమెరికాలోని బఫ్ఫలో విశ్వవిద్యాలయానికి చెందిన గిల్ వోల్ఫ్ పేర్కొన్నారు.