Police (Photo Credits: IANS)

Bhopal, August 4: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా (Madhya Pradesh Coronavirus) విజృంభిస్తోంది. ముఖ్యంగా ప్రజలను అలర్ట్ చేస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసులు కరోనా భారిన పడుతున్నారు. రాష్ట్రంలో 588 పోలీసులకు కరోనా (580 policemen infected with Covid-19) సోకిందని, 2000 మంది పోలీసులను క్వారంటైన్ (2,000 quarantined ) చేశామని హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా (state home minister Narottam Mishra) వెల్లడించారు. సిద్ధరామయ్యకు కరోనా, స్వీయ నిర్భంధంలోకి త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ డెబ్, దేశంలో తాజాగా 52,050 కేసులు నమోదు, 18,55,745కు పెరిగిన కోవిడ్-19 కేసుల సంఖ్య

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2వేల మంది పోలీసులకు సెలవు మంజూరు చేశామని, వారి కుటుంబసభ్యులకు కరోనా సోకుతుందనే భయంతో వారిని క్వారంటైన్ కు తరలించామని మంత్రి మిశ్రా చెప్పారు.పోలీసుల ఆరోగ్యం కాపాడటానికి తాము ప్రాధాన్యమిస్తామని మంత్రి చెప్పారు. కరోనా వల్ల అత్యవసర పరిస్థితులున్నా వారి ఆరోగ్య పరిస్థితుల వల్ల సెలవులు మంజూరుచేశామని మంత్రి వివరించారు.

ఇటీవలే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ అనారోగ్యం బారిన పడి కరోనా పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్ అని తేలింది.

Here's Report

ఆ తర్వాత మధ్యప్రదేశ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కరోనా చికిత్స తీసుకున్నారు. ఈరోజుకి శివరాజ్ సింగ్ చౌహన్ కరోనా చికిత్స తీసుకుని పది రోజులు అవుతుంది. అయితే తాజాగా మరోసారి వైద్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ కి కరోనా నిర్దారిత పరీక్షలు నిర్వహించారు. అయితే పది రోజులు గడిచినప్పటికీ శివరాజ్ సింగ్ చౌహాన్ కి మరోసారి పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా 750 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 34,285 కేసులు నమోదయ్యాయి. 24,099 మంది డిశ్చార్జ్ అయ్యిరు రాష్ట్రంలో ఇప్పటివరకు 900 మరణాలు సంభవించాయి.