 
                                                                 Geneva, August 3: ప్రపంచ దేశాలను కరోనావైరస్ ముప్పతిప్పలు పెడుతోంది. ఇంతరవకు దానికి సరి అయిన వ్యాక్సిన్ (COVID19 Vaccines) అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్-10కు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. కరోనా వైరస్ (Coronavirus) టీకా రూపకల్పనకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ సులభమైన పరిష్కారం ఏదీ ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వ్యాఖ్యానించింది. కరోనా వ్యాక్సిన్‌పై శుభవార్త, కోవిషీల్డ్‌పై ఫేజ్ 2,ఫేజ్ 3 ప్రయోగాలకు డీసీజీఐ అనుమతులు, త్వరలో ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఎలాంటి మంత్ర దండం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) డెరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ (Tedros Adhanom Ghebreyesus) అభిప్రాయపడ్డారు. ‘కొవిడ్ టీకా (COVID19 Vaccine) కోసం యావత్ ప్రపంచం నిర్విరామంగా కృషి చేస్తున్నది. పలు ప్రయోగాలు మూడో దశను కూడా చేరుకున్నాయి. వైరస్‌ను కట్టడి చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ రావాలని కోరుకుంటున్నాం. కానీ, ఇప్పటికిప్పుడు వైరస్‌ను ఎదుర్కొనే మంత్రదండం లేదు. ఎప్పటికీ ఉండకపోవచ్చు’ అని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, భౌతికదూరం, మాస్క్ ధరించడం వంటి ప్రాథమిక అంశాలపైనే ప్రభుత్వాలు, పౌరులు దృష్టి పెట్టాలని సూచించింది. చైనాలో ఈ వైరస్ మనుషుల్లోకి ఎలా ప్రవేశించిందనే విషయమై విచారణ జరిపేందుకు డబ్ల్యూహెచ్‌వో పంపిన ఇద్దరు సభ్యుల బృందం తన ప్రాథమిక విచారణను ముగించిందని ఘెబ్రెసియస్ తెలిపారు. త్వరలోనే వైరస్ మూలాలను కనుగొనేందుకు డబ్ల్యూహెచ్‌వో నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం చైనా పరిశోధకులతో కలిసి ప్రయత్నించనుందన్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
