COVID-19 Vaccine Update: కరోనా వ్యాక్సిన్‌పై శుభవార్త, కోవిషీల్డ్‌పై ఫేజ్ 2,ఫేజ్ 3 ప్రయోగాలకు డీసీజీఐ అనుమతులు, త్వరలో ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్
COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, August 3: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో వ్యాక్సిన మీద ఆశలు (COVID-19 Vaccine Update) రేకెత్తుతున్నాయి. తాజాగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford Univesity), ఆస్ట్రాజెనెకా (Astra Zeneca) అభివృద్ధి చేసిన కోవిడ్ -19 వాక్సిన్‌పై (COVID-19 Vaccine) మనదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. బీజేపీ అగ్రనేతల్లో కరోనా కలవరం, బి.ఎస్.యడ్యూరప్పకు కరోనా పాజిటివ్, దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు, హోమంత్రి అమిత్ షాకు కోవిడ్-19 పాజిటివ్

లండన్‌లో జరిగిన హ్యూమన్ ట్రయల్స్‌లో ఇప్పటికే సత్ఫలితాలు రావడంతో తాజాగా ఈ వ్యాక్సిన్‌పై భారత్‌లోనూ ప్రయోగాలు చేయనున్నారు. కోవిషీల్డ్ గా (COVISHIELD) పిలుస్తున్న ఈ వాక్సిన్‌పై ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు. సుమారు 5వేల మందితో భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.

కోవిషీల్డ్ పేరుతో ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనికా టీకా ప‌రీక్షిస్తున్న‌ది. కోవిడ్‌19 నిపుణుల క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. అయితే మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హ‌ణ‌కు ముందు.. డేటా సేఫ్టీ మానిట‌రింగ్ బోర్డు ఇచ్చే నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అది అయిన వెంటనే టీకా ట్రయల్స్ ప్రారంభిస్తామని, త్వరలోనే పెద్ద పరిమాణంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి కూడా మొదలు పెడతామని ఎస్‌ఐఐ సీఈవో అదార్ పూనవల్లా ప్రకటించారు.

కోవిషీల్డ్ పేరుతో రాబోయే ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి అతిపెద్ద టీకా తయారీ సంస్థ ఎస్ఐఐ, బయోఫార్మా మేజర్ ఆస్ట్రాజెనెకాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ టీకాపై యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో ట్రయల్స్ అధునాతన దశలో ఉన్నాయి. ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్ 2,3వ ట్ర‌య‌ల్స్ బ్రిట‌న్‌లో కొన‌సాగుతున్నాయి. బ్రెజిల్‌లో ఫేజ్ త్రీ, ద‌క్షిణాఫ్రికాలో మొద‌టి, రెండ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి.

నాలుగు వారాల వ్య‌వ‌ధిలో రెండు డోస్‌లు ఇవ్వ‌నున్నారు. మొద‌టి రోజు తొలి డోస్‌.. ఆ త‌ర్వాత 29వ రోజున రెండ‌వ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ప్ర‌తిపాద‌న ప్ర‌కారం సుమారు 1600 మందిపై ఇండియాలో సీర‌మ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్నారు. 17 న‌గ‌రాల్లో ఈ ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌నున్నారు.

అధికారిక గణాంకాల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 38,135మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రెజిల్ తర్వాత కేసుల సంఖ్యలో భారత్ మూడోస్థానంలో ఉంది.