Dog Turns Into A Tiger: పులిలా మారిన కుక్క, పరారవుతున్న కోతులు, ఇదంతా తోటను రక్షించుకోవడానికే అంటున్న కర్ణాటక రైతు, ఆయన బాటలో పయనిస్తున్న మరికొందరు రైతులు
ఇది ఓ కుక్క..మరి దీనికి పులి చర్మం ఉంది ఏంటి అనుకుంటున్నారా..అయితే అక్కడే ఓ ట్విస్టు ఉంది. ఓ రైతు తన పెంపుడు కుక్కని ఇలా పెద్దపులి(Dogs painted as tigers )లా తయారు చేశాడు. అయితే ఆ రైతు(Farmer) ఈ పని చేసింది సరదా కోసం కాదు. తన తోటను రక్షించుకోడానికి.
Shivamogga, December 1: ఈ ఫోటోలో కనిపిస్తున్నది పులి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇది ఓ కుక్క..మరి దీనికి పులి చర్మం ఉంది ఏంటి అనుకుంటున్నారా..అయితే అక్కడే ఓ ట్విస్టు ఉంది. ఓ రైతు తన పెంపుడు కుక్కని ఇలా పెద్దపులి(Dogs painted as tigers )లా తయారు చేశాడు. అయితే ఆ రైతు(Farmer) ఈ పని చేసింది సరదా కోసం కాదు. తన తోటను రక్షించుకోడానికి.
కర్ణాటక(karnataka)లోని నాలూరు గ్రామానికి చెందిన శ్రీకాంత గౌడ్(Srikant Gowda).. తోటలో వేసిన పంటను కోతులు రోజూ నాశనం చేస్తుండటంతో ఇలా ఆలోచన చేశారు. నాలుగేళ్ల కిందట ఓ పులి (Tiger)బొమ్మను తోటలో పెట్టాడు. అప్పటి నుంచి కోతులు అటువైపు రావడం మానేశాయి. దీంతో ఆశ్చర్యపోయిన శ్రీకాంత మరో తోటలో కూడా పులిబొమ్మను ఏర్పాటు చేశాడు. అది మంచి ఫలితం ఇచ్చి కోతులు రావడం మానేశాయి.
Naresh shenoy Tweet
ఇక బొమ్మలు పెట్టడం ఎందుకని తన పెంపుడు కుక్కకు జుట్టుకు వేసుకుని డై కలర్‌తో పెద్ద పులి చారల్ని డిజైన్(Farmer Paints Tiger Stripes) గా వేశాడు. తన కుక్కనే పులిగా మార్చేశాడు. ఆ కుక్క తోటలో తిరుగుతుంటే కోతులు తోట వైపు తొంగి కూడా చూడటంలేదట.
ఈ ఐడియాతో శ్రీకాంత గౌడ తన తోటను కాపాడుకోగలుగుతున్నాడు. కెమికల్ రంగులు వేస్తే కుక్క చర్మం పాడవుతుందని హెయిర్ డై వేస్తున్నాడట. శ్రీకాంత్ గౌడను చూసిన మరో రైతు సదానంద గౌడ కూడా తాను వేసిన మొక్కజొన్న పంటను కాపాడుకోవటానికి పులి బొమ్మల్ని కాపాలాగా పెట్టుకున్నాడు. అతని పొలంపై కూడా కోతులు దాడి చేయటం