Ban on Hookah Bars: హుక్కా బార్‌లపై ఉక్కుపాదం మోపనున్న కర్ణాటక ప్రభుత్వం, పొగాకు వినియోగానికి వయోపరిమితి పెంపు యోచనలో సర్కారు, ఏ వయస్సు వారికి పొగాకు అమ్మొద్దంటే?

దీంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే (Raise Age For Smoking) అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు.

Hookah Bars (PIC @ unsplash)

Bangalore, SEP 20: ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్న హుక్కా బార్‌లపై (Hukka Bars) కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిషేధం విధించాలని యోచిస్తోంది. దీంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే (Raise Age For Smoking) అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు. (Ban Hookah Bars) 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు యువకులు హుక్కా బార్లకు వస్తున్నారని, ఈ పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు చట్టం తేవాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ‘‘హుక్కా తాగే సమయంలో ఎలాంటి పదార్థాలు కలుపుతారో మాకు తెలియదు.. ఆ పదార్ధాలు యువకులను అడిక్ట్ అయ్యేలా చేస్తున్నాయి’’ అని మంత్రి రావు పేర్కొన్నారు.

Odisha Floods: భారీ వరదలకు కొట్టుకుపోయిన కారు, చెట్టు అడ్డం రావడంతో వెంటనే ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న ఇద్దరు వ్యక్తులు 

దీంతో కర్ణాటక ప్రభుత్వం సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. ప్రస్థుతం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం, విద్యాసంస్థలకు 100 గజాలలోపు పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని నిషేధిస్తుంది. ప్రతిపాదిత సవరణలు ఈ నిషేధాన్ని ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, మతపరమైన సంస్థల చుట్టూ ఉన్న ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.