Karnataka Lockdown 4.0: నాలుగు రాష్ట్రాల ప్రజలకు నో ఎంట్రీ, ఆర్టీసీ బస్సులు,ప్రైవేటు బస్సుల రవాణాకు అనుమతి, బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలన్న కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్ప
ఆ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల రవాణాకు అనుమతి ఇచ్చింది. బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్ప (CM Yediyurappa) అధికారికంగా ప్రకటించారు.
Bengaluru, May 18: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ 4 (Karnataka Lockdown 4.0) సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల రవాణాకు అనుమతి ఇచ్చింది. బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్ప (CM Yediyurappa) అధికారికంగా ప్రకటించారు. అమెరికాలోకి అక్రమంగా భారతీయుల చొరబాటు, 161 మందిని వెనక్కి తిప్పి పంపిస్తున్న యుఎస్ఏ, అమెరికాలోని 95 జైళ్లలో బందీలుగా 1739 మంది ఇండియన్లు
కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ (Lockdown 4.0) నిబంధనలను కఠినంగా అమలు చేస్తామన్నారు. ఇతర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు అనుమతించబడతాయన్నారు. కాగా ఆదివారం రోజు రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. హోం క్వారంటైన్‌ను మరింత బలోపేతం చేస్తామని సీఎం తెలిపారు.
లాక్ డౌన్ 4 వేళ అన్ని దుకాణాలు తెరువబడుతాయని సీఎం చెప్పారు. రాష్ట్ర పరిధిలో అన్ని రైళ్లు నడుస్తాయని సీఎం యోడియూరప్ప పేర్కొన్నారు. దీంతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు నుంచి వచ్చే వారిని మే 31 వరకు రాష్ట్రంలోకి అనుమతించమని కర్ణాటక సీఎం స్పష్టం చేశారు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడకు రావొద్దని కోరారు. ఇండియాలో లక్షకు చేరువలో కరోనా కేసులు, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,242 కొత్త కోవిడ్ 19 కేసులు, వణికిస్తున్న ముంబై
ఇదిలా ఉంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరస్పర అంగీకారంతో వాహనాలు, బస్సులు తదితర ప్రజారవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహనాల్ని నడిపే అంశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదే తుది నిర్ణయమని కేంద్రం ప్రకటించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల రాష్ట్రంలో 30 మంది మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 84 కరోనా కేసులు నమోదయ్యాయి.