Coronavirus Cases in India (Photo Credits: PTI)

Mumbai, May 18: భారత్‌లో కరోనా (Coronavirus Cases in India) విలయతాండవం చేస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 5,242 కేసులు నమోదవగా, 157 మంది మృతిచెందారు. దేశంలో ఒకే రోజు ఈ స్థాయిలో పాజిటీవ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా పాటిజివ్‌ కేసుల సంఖ్య 96,169కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల ఇప్పటివరకు 3029 మంది బాధితులు (Coronavirus Deaths) మరణించారు. దేశంలో ప్రస్తుతం 56,316 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 36,823 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్ పొడగింపు, నేటి నుంచే లాక్‌డౌన్ 4.0 అమలు, నూతన లాక్‌డౌన్ మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, కొత్తగా ఏం మార్పులు జరిగాయో చూడండి

లాక్‌డౌన్‌ (Lockdown) అమవలుతున్నప్పటికి పాజిటీవ్‌ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. గత రెండు రోజులుగా రోజు దాదాపు 5 వేల చొప్పున పాజిటీవ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,053 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1198 మంది మరణించారు. గుజరాత్‌లో 11,379 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదగా, 659 మంది మృతిచెందారు, తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 11,224కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 78 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో 10,054 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు 160 మంది మృతిచెందారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) రోజురోజుకీ వంద‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇవాళ ఒక్క రోజే 1571 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 38 మంది మృతి చెందారు. ఇవాళ్టి కేసుల‌తో ముంబైలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19967కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు 5012 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జవగా..కరోనా బారిన పడి 734 మంది మృతి చెందినట్లు బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వెల్ల‌డించింది. మ‌హారాష్ట్ర‌లో న‌మోదవుతున్న కేసుల్లో అత్య‌ధికంగా ముంబై నుంచి ఉన్నాయి.