Karnataka: బ్యాంకు లోన్ తిరస్కరించిందనే కోపంతో.. దాన్నిపెట్రోల్ పోసి తగలెట్టేశాడు, కర్ణాటకలో షాకింగ్ ఘటన, బ్యాంక్ అంతర్గత సిబ్బంది ప్రమేయం ఉందని గ్రామస్తులు అనుమానాలు
తనకు బ్యాంకులో లోన్ ఇవ్వలేదని ఏకంగా బ్యాంకునే (Karnataka man sets bank on fire) తగలెట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది.
Bengaluru, Jan 11: కర్ణాటకలో వింత ఘటన చోటు చేసుకుంది. తనకు బ్యాంకులో లోన్ ఇవ్వలేదని ఏకంగా బ్యాంకునే (Karnataka man sets bank on fire) తగలెట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది. వివరాల్లోకి వెళితే.. వసీమ్ అనే వ్యక్తి బైక్ మీద హవేరి జిల్లా బైడగి తాలూకా సమీపంలోని హెడిగొండ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో ఉన్న బ్యాంక్ కిటికీలో నుంచి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి.
దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. అయితే ఈ ఘటనను గమనించిన గ్రామస్తులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసిన విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు బ్యాంక్ వద్ద తాను లోక్ దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు. అయితే తన లోన్ దరఖాస్తును బ్యాంక్ తిరస్కరించదని (loan application rejected), ఆ కోపంతో బ్యాంక్‌ను పెట్రోల్‌తో తగలబెట్టానని పోలీసులకు తెలిపాడు.
అయితే ఈ ఘటన వెనక బ్యాంక్ అంతర్గత సిబ్బంది ప్రమేయం ఉందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులోని కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు ధ్వసం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.