IPL Auction 2025 Live

Karnataka Shocker: ఉద్యోగితో వ్యాపారవేత్త గే సంబంధం, రాత్రి పని కానిచ్చిన తర్వాత పెళ్లి గొడవ, వ్యాపారిని దారుణంగా చంపేసిన ఉద్యోగి

ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత పోలీసులు మృతుడి స్నేహితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.

Representational Purpose Only (File Image)

Bengaluru Gay Partner Kills Bizman: బెంగుళూరులో ఓ వ్యాపారి వారం రోజుల క్రితం అతని సన్నిహితుడి చేతిలో హత్యకు (Bengaluru Gay Partner Kills Bizman) గురయ్యాడు. ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత పోలీసులు మృతుడి స్నేహితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు ముందుగా ఆర్థిక వివాదాలను అనుమానించినప్పటికీ, నిందితుడు మృతుడైనా వ్యాపారవేత్తతో సంబంధం కలిగి ఉన్నాడని తెలిసింది. వారి స్వలింగ సంపర్క సంబంధాన్ని ముగించాలని వ్యాపారి డిమాండ్‌ను అంగీకరించకపోవడంతో వ్యాపారవేత్తను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్థారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లియాకాత్ అలీ ఖాన్ అనే వ్యాపారవేత్త ఓ అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. లియాకాత్ అలీకి ఓ మహిళతో పెళ్లైంది. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి వద్ద ఇల్యాజ్ ఖాన్ అనే ఉద్యోగి పనిచేస్తున్నాడు. అయితే ఇద్దరు స్వలింగసంపర్కులు కావడంతో వీరి మధ్య స్వలింగ సంపర్క సంబంధం ఏర్పడింది. కరోనా లాక్‌డౌన్‌లో వీరి మధ్య ఏర్పడగా ఆ రిలేషన్ రెండేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నారు.

ట్రాన్స్‌జెండర్‌ మాయలో పడిన 6 గురు పిల్లల తండ్రి, కట్టుకున్న భార్యను వదిలేసి లింగ మార్పిడి చేయించుకున్న వైనం..

ఫిబ్రవరి 28న కూడా మైసూరు రోడ్డులోని నయందహల్లిలో పాత భవనంలో రాత్రి ఇద్దరూ కలిశారు.పని అయిపోయిన తర్వాత తనకు అమ్మాయితో పెళ్లి (Accused Wanted To Marry a Girl) కుదిరిందని, ఇకపై రిలేషన్ కొనసాగించలేనని వ్యాపారితో ఇల్యాజ్‌ ఖాన్ చెప్పాడు. అయితే దీనికి లియాకాత్ ఒప్పుకోలేదు. నాతో రిలేషన్ కొనసాగించాల్సిందేనని (Forcing Him To Continue Relation) పట్టుబట్టాడు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

భార్యను చంపి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన భర్త, వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానమే కారణం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

అయితే ఈ బండారం బయటపడుతుందనే భయంతో కూడిన ఆవేశంలో లియాకాత్‌ను ఇల్యాజ్‌ తలపై సుత్తితో బాదాడు. ఆపై కత్తెరతో అతడ్ని పొడిచాడు. తీవ్రగాయాలపాలైన లియాకాత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లియాకాత్ కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదట ఈ హత్యలో ముగ్గురి ప్రమేయం ఉండవచ్చని అనుమానించారు. కానీ ఇల్యాజ్‌ను విచారించగా అసలు విషయం తెలిసింది. అతనొక్కడే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు.