Karnataka Shocker: అమ్మవారి పల్లకి తాకాడని దళిత బాలుడికి రూ.60 వేలు జరిమానా, భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడి తల్లి, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు
కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని ఉళ్లేరహళ్లి గ్రామంలో దళిత బాలుడు అమ్మవారి పల్లకీని ముట్టుకున్నాడని గ్రామస్తులు అతని కుటుంబానికి రూ.60 వేల జరిమానా (Dalit Family Fined Rs 60,000) విధించారు.
Amaravati, Sep 21: దేశంలో ఇంకా అస్పృశ్యత పోలేదు. ఎక్కడో ఓ చోట అది బయటకు వస్తూనే ఉంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని ఉళ్లేరహళ్లి గ్రామంలో దళిత బాలుడు అమ్మవారి పల్లకీని ముట్టుకున్నాడని గ్రామస్తులు అతని కుటుంబానికి రూ.60 వేల జరిమానా (Dalit Family Fined Rs 60,000) విధించారు. డబ్బు కట్టకపోతే అక్టోబర్ 1 లోగా గ్రామం విడిచి వెళ్లాలని (Banned From Entering Village) హుకుం జారీచేశారు.
ఉళ్లేరహళ్లి గ్రామంలో 10వ తరగతి చదువుతున్న దళిత బాలుడు చేతన్ ఈ నెల 8వ తేదీన ఊరిలో బూత్యమ్మ జాతరలో అమ్మవారి పల్లకీని (Koppal After Boy Touches Hindu God’s Idol in Temple) తాకాడు. ఇది చూసి అగ్రవర్ణాల వారు బాలున్ని మందలించి కొట్టారు. అంతటితో ఆగకుండా పంచాయతీ పెట్టారు. దళిత బాలుడు ముట్టుకోవడం వల్ల మైలపడిందని, ఇందుకు శాంతి కార్యక్రమం చేయడానికి రూ.60 వేలు కట్టాలని బాలుని తల్లి శోభను ఆదేశించారు.
దీంతో భయపడిన బాధితుడి తల్లి శోభ సోమవారం మాస్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేట్టారు. పలు దళిత సంఘాలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు నారాయణస్వామి, రమేష్, వెంకటేశప్ప, నారాయణస్వామి, కొట్టప్ప, అర్చకుడు మోహన్‌రావ్, చిన్నయ్యలతో పాటు మరికొందరిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.