Karnataka Shocker: కాళ్లు పట్టుకున్నా.. కనికరించని కామాంధులు, యువతిని కొడుతూ దారుణంగా అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్లు, అత్యాచారం చేసిన దృశ్యాలను వీడియో తీసి మళ్లీ రావాలని బెదిరింపులు

కొడుతూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. పైగా అత్యాచారం చేసిన దృశ్యాలను (Friend Records Crime)వీడియో తీసి ఆమెను బెదిరించారు. తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Yadgir, April 29: కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో దారుణం (Karnataka Shocker) చోటు చేసుకుంది. హొసళ్లి గ్రామానికి చెందిన ఓ యువతిపై ఆటో డ్రైవర్ అతని ఫ్రెండ్ సామూహిక అత్యాచారం (House help raped by auto driver) చేశారు. యాదగిరి ఎస్‌పీ వేదమూర్తి గురువారం మీడియాకు వివరాలను వెల్లడించారు. ఓ యువతి పని చేసేందుకు హొసళ్లి తండా నుంచి యాదగిరికి ఆటోలో వెళ్లి వచ్చేది. ఈ నెల 26న ఆటో డ్రైవర్‌ హనుమంతు పథకం ప్రకారం స్నేహితుడు నరసప్పతో కలిసి ఆటోలో కూర్చొన్న యువతిని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారు.

తనను వదిలివేయాలని ఆమె కాళ్లుపట్టుకున్నా కనికరించలేదు. కొడుతూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. పైగా అత్యాచారం చేసిన దృశ్యాలను (Friend Records Crime)వీడియో తీసి ఆమెను బెదిరించారు. తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. యువతి కుటుంబ సభ్యులకు దారుణం గురించి చెప్పింది.

ప్రియుడితో కోడలు రాసలీలలు, వద్దని వార్నింగ్ ఇచ్చిన మామ, కోపంతో ప్రియుడుతో కలిసి మామని చంపేసిన కోడలు, నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన

వారు యాదగిరి మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు గాలించి హనుమంతు, నరసప్పలను అరెస్ట్‌ చేశారు. ఎస్‌పీ మాట్లాడుతూ ఆటోల్లో వెళ్లేటప్పుడు మహిళలు జాగ్రత్తలు పాటించాలని, కుటుంబ సభ్యులకు ఆటో నంబర్‌తో పాటు, లొకేషన్‌ను పంపాలని సూచించారు.



సంబంధిత వార్తలు