Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Nizamabad, April 28: తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో దారుణం (Nizamabad Shocker) చోటు చేసుకుంది. తమ రాసలీలలకు మామ అడ్డువస్తున్నాడని ఓ కోడలు (daughter-in-law) ప్రియుడితో కలిసి మామను (killed her uncle) చంపేసింది. నిజామాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారాంకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లాడు. అతని భార్య లత(Latha) అత్తమామల దగ్గర ఉంటోంది. మదనపల్లి గ్రామానికి చెందిన దుంపటి శ్రీనివాస్‌(Srinivas) అనే సమీప బంధువు గంగారాం పొలం కౌలు తీసుకొని సాగు చేస్తున్నాడు.

ఈక్రమంలోనే శ్రీనివాస్‌తో లతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈవిషయం మామ గంగారాంకు తెలియడంతో పద్దతి మార్చుకోమని కోడలికి మంచిగా చెప్పాడు. తీరు మార్చుకోకపోవడంతో పలుమార్లు గొడవపడ్డారు. విషయం చేయి దాటిపోతోందని గ్రహించిన గంగారం శ్రీనివాస్‌ని కౌలు మాన్పించాడు. తన ప్రియుడ్ని తనకు దూరం చేశాడన్న కోపంతో రగిలిపోయిన లత కొద్ది రోజులు పుట్టింటింకి వెళ్లింది. వరి కోతలు పూర్తై పంట చేతికి రాగానే ఈ నెల 23న తన పొలం తనకు అప్పగించమని కోడలు లత ప్రియుడు శ్రీనివాస్‌ని వెంటబెట్టుకొచ్చి మామ గంగారంతో గొడవపెట్టుకుంది. ఈక్రమంలోనే పొలం, పంట రెండూ ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఎలాగైనా మామను అడ్డు తొలగించుకోవాలని చూశారు.

రెప్పపాటులో కాటేసిన మృత్యువు, ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి, పిల్లలకు తీవ్ర గాయాలు, చివ్వెంల మండల పరిధిలో విషాద ఘటన

మరుసటి రోజు 24న రాత్రి ప్రియుడు శ్రీనివాస్‌తో పాటు మదనపల్లి గ్రామానికి చెందిన బి.సురేష్ ఇద్దరూ కలిసి గన్నారం గ్రామానికి వచ్చారు. వడ్ల కుప్పపై పడుకున్న గంగారాం ఛాతీపైన కూర్చుని శ్రీనివాస్ వెదురు కర్రతో గొంతుపైన అదిమి పట్టుకుని.. పక్కనే ఉన్న రాయితో తలపై కొట్టి హత్య చేశాడు. ఇందుకు సురేష్ సహకరించారు. ఆ శబ్దానికి పక్కనే ఉన్న మరో వడ్ల కుప్ప వద్ద కాపలాగా ఉన్న వృద్ధుడు జాజుల పెద్దనారాయణ నిద్రలేచి వీరిని అడ్డుకోవాలని చూడగా అతడిపై రాయితో దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఇంతలో వాహనాలు రావడంతో అక్కడి నుంచి నిందితులిద్దరూ పరారయ్యారు.

హత్య జరిగినట్లుగా సమాచారం అందుకున్న ఇందల్వాయి పోలీసులు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీస్ విచారణలో మృతుని కోడలు లత ఆమె ప్రియుడు శ్రీనివాస్‌తో పాటు సురేష్ అనే మరో వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో అంగీకరించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. వివాహేతర సంబంధం కోసం ఆస్తి గొడవ పెట్టుకొని మామను హత్య చేసిన కేసును రోజుల వ్యవధిలో చేధించిన సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను ఏసీపీ అభినందించారు.